బ్రిటన్ కు 1110 కోట్లు చెల్లించనున్న గూగుల్‌

Google To Pay 1110 CroresTo Britain

03:23 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Google To Pay 1110 CroresTo Britain

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ బ్రిటన్ కు పన్నుల రూపంలో దాదాపు 1110 కోట్ల చెల్లించనుంది. ఈ విషయాన్ని గూగుల్ కంపెనీ అధికార ప్రతినిధి శనివారం వెల్లడించారు. బ్రిటన్‌లో కార్యకలపాలు సాగిస్తూ ప్రధాన కేంద్రం వేరే ప్రాంతాల్లో ఉన్న బహుళజాతి సంస్థలు బ్రిటన్‌కు తక్కువ పన్నులు చెల్లిస్తున్నాయనే వివాదంపై బ్రిటన్‌కు చెందిన హెచ్‌ఎం రెవెన్యూ అండ్‌ కస్టమ్స్‌(హెచ్‌ఎంఆర్‌సీ) ఆరేళ్ల పాటు దర్యాప్తు చేసింది. ఇందులో గూగుల్ సహా పలు కంపెనీలు తక్కువ పన్నులు చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌సీ నూతన ప్రతిపాదనలను అంగీకరిస్తూ 2005 నుంచి కట్టాల్సిన పన్నులను చెల్లించనున్నట్లు గూగుల్‌ వెల్లడించింది.

English summary

Famous Search Engine Company Google has ordered to pay 1110 Crores to britain by H.M.Revenue And Customs Department