అమృత షేర్‌-గిల్‌ నివాళిగా గూగుల్‌ డూడుల్‌

Google Tribute Amrita Sher-Gil

10:50 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Google Tribute Amrita Sher-Gil

ఎప్పటికప్పుడు ప్రాధాన్యతను బట్టి, ఆయా రోజుల్లో గూగుల్‌ హోంపేజీలో ప్రత్యేక డూడుల్‌ అందిస్తున్న క్రమంలో ప్రఖ్యాత భారతీయ చిత్రకారిణి అమృత షేర్‌-గిల్‌ 103వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ హోంపేజీలో శనివారం ప్రత్యేక డూడుల్‌ అందిస్తూ, తద్వారా నివాళులర్పించింది. అమృత ‘ముగ్గురు అమ్మాయిల’ (త్రీ గర్ల్స్‌)పెయింటింగ్‌ స్ఫూర్తితో గూగుల్‌ డూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్‌ను భారత్‌, ఇండోనేషియా, జపాన్‌, కెన్యా, కజకిస్థాన్‌, అర్జంటీనా, చిలీ, పెరు, ఐస్‌ల్యాండ్‌, పోర్చుగల్‌, సైబీరియా, స్లోవేనియా, లిథునియా దేశాలలో హోంపేజీలో వుంచినట్లు తెలియ వచ్చింది.

1913 జనవరి 30న హంగేరీలోని బుడాపెస్ట్‌లో అమృత జన్మించారు. ఆమె తండ్రి పంజాబీ కాగా, తల్లి హంగేరియన్‌ యూదు మతస్థురాలు. 28 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె 1941 డిసెంబరు 5న పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కన్నుమూశారు. 20వ దశాబ్దంలో అమృత భారత్‌కు చెందిన ప్రఖ్యాత చిత్రకారిణిగా గుర్తింపు పొందడం జరిగింది. ఇప్పుడు గూగుల్‌ అందించిన డూడుల్‌ తో అమృతను స్మరించుకునే అవకాశం కల్పించింది.

English summary