గూగుల్ కొత్త ఫీచర్

Google's New Feature

06:01 PM ON 4th November, 2015 By Mirchi Vilas

Google's New Feature

టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న గూగిల్ మరో సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఇప్పటికే రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ ఇలా వివిధ రంగాలలో వినూత్న ప్రయోగాలను చేపడుతూ తన ఆధిపత్యాన్నినిలబెట్టుకుంటున్న గూగిల్ , తన నూతన ఆవిష్కరణతో సామాన్య మానవుని బుర్రను తొలిచివేస్తున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. అదే ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలను ఆటోమెటెడ్ గా అందించే విధానం. గూగుల్ మెయిల్ ద్వారా వినూత్నమైన ఫీచర్లను అందిస్తున్న గూగిల్ సంస్థ ఇప్పుడు ఆటోమేటెడ్ రిప్లే అనే ఫీచర్ ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ మెదడును తొలిచేస్తున్న ఎన్నో ప్రశ్నలకు గూగిల్ నుండి సమాధానాన్ని పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ ప్రశ్నను టైప్ చేసి గూగిల్ కు పంపడమే. వెంటనే ఆ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానంతో గూగిల్ మీ ముందు ఉంటుంది. ఉదాహరణకి మానవుల ఎదురుకుంటున్నసవాళ్లను ప్రశ్నలను సైతం గూగుల్ చెప్పగలదు. మానవుడు స్టీరింగ్ వీల్ లేకుండా డ్రైవ్ చేసే కార్స్ ను తయారు చేశాడు. అదేవిధంగా గూగుల్ కూడా ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ ను అనుసరించి ఈ ఆవిష్కరణను చేపట్టింది. దాని పేరు ర్యాంక్ బ్రైన్. ఇది గూగుల్ యొక్క 6 ఏళ్ల కృషి. ఇంక భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలకు గూగిల్ నడుం కట్టనుందో, అవి మానవ జీవనాన్ని ఎంతగా ప్రభావితం చేయనున్నాయో వేచిచూడాల్సిందే.

English summary

Google Introduces its new feature The technology is part of an update to Google's Inbox app for managing and organizing email . The feature announced Tuesday is the latest example of Google's effort to teach machines how to take over some of the tasks typically handled by humans.