ఇక గూగుల్ నుంచి వాలట్

Googles New Google Wallet

03:37 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Googles New Google Wallet

పేటీఎం, వోలామనీ, మొబీక్విక్ తదితర సంస్థలు ఇప్పటి వరకు మనీ వాలెట్ లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులోకి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా రానుంది. సులభంగా డబ్బును బదిలీ చేసేందుకు వీలు కలిగిన సరికొత్త వాలట్ యాప్ ను లాంచ్ చేయనున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్ నుంచి త్వరలోనే వినియోగదారులు తమ డబ్బును బదిలీ చేసుకోవచ్చని చెపుతోంది. ఫోన్ నంబర్ ఉంటే చాలు గూగుల్ వాలట్ అకౌంట్ లేని వారికి సైతం దీని నుంచి డబ్బులు పంపవచ్చంటోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఎస్ఎంఎస్ లింకు ద్వారా డబ్బులను పంపవచ్చు. దీని కోసం యూజర్లు డబ్బును పంపేందుకు, స్వీకరించేందుకు గూగుల్ వాలట్ అకౌంట్ తో పాటు ఈమెయిల్ అడ్రస్ కూడా ఉండాలి. గూగుల్ వాలెట్ యూజర్లు ఒక సెక్యూర్ లింక్ ద్వారా డబ్బును పంపొంచ్చు. రిసీవర్ ఆ లింక్ ను ఓపెన్ చేసి డెబిట్ కార్డ్ నంబర్, ఇతర అకౌంట్ వివరాలతో ఒక ఫామ్ ను పూరించాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ను పూర్తి చేసి సబ్మిట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే డబ్బులు సంబంధిత అకౌంట్ లోకి జమ అవుతాయి. అయితే ప్రస్తుతం ఈ అవకాశం అమెరికాలోని యూజర్లకు మాత్రమే గూగుల్ కల్పిస్తోంది. ఈ యాప్ కు సంబంధించిన ఐఓఎస్ యాప్ అప్ డేట్ కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుందని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం మరికొంత కాలం వేచిచూడాల్సిందే. కాగా, ఈ యాప్ ను భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయాన్ని గూగుల్ వెల్లడించలేదు.

English summary

Google announces new google wallet app.With the use of this wallet we can send money, we can book tickets online,we can pay bills etc