గూగుల్ రిపబ్లిక్ డే స్పెషల్ డూడుల్‌ 

Google's Republic Day Doodle

05:10 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Google's Republic Day Doodle

భారత 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ ప్రత్యేక డూడుల్ ను తన హోంపేజీలో ఉంచింది. ఈ ప్రత్యేక డూడుల్‌తో భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది. బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఒంటెల దళం వివిధ వాయిద్యాలతో కవాతు చేస్తూ రూపొందించిన డూడుల్‌ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఒంటెలపై ఉన్న బంగారు వర్ణ వస్త్రంపై గూగుల్‌ అని ఎర్రటి అక్షరాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ప్రత్యేక సందర్భాలు, పండుగలు తదితర రోజుల్లో గూగుల్‌ తన హోంపేజీని ప్రత్యేక డూడుల్‌తో తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే.

English summary

Google salutes India's Republic Day by its Doodle.Today Google posted with camels on its home page In honour of India's 67th Republic Day