పేమెంట్ తీసుకోని రియల్ హీరోస్

Gopichand And Prabhas Free Ad Campaign For Pure Health Life Services

10:50 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Gopichand And Prabhas Free Ad Campaign For Pure Health Life Services

ఇదేమిటి అనుకుంటున్నారా? నిజంగా వీళ్ళు పేమెంట్ తీసుకోకుండానే పనిచేయడానికి ముందుకొచ్చారు. ఇంతకీ ఎందుకంటే, ఓ హెల్త్ కార్డు విషయంలో ఉచితంగా పనిచేస్తున్నారు. అందుకే రీల్ లైఫ్ హీరోలు రియల్ లైఫ్ లో కూడా ఒక్కోసారి హీరోలుగా మారుతుంటారని అంటారు. వీళ్ళు నిజంగా మారారు.

అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మనీ చుట్టే తిరుగుతుందనే విషయం తప్పనేలా ప్రభాస్ - గోపీచంద్ ప్రవర్తించారు. నిజానికి ఇలా చేయడం చాలా అరుదుగా జరుగతుంది. అసలు విషయానికి వస్తే, ఈ ఇద్దరు హీరోలు కలసి ఫ్రీగా ఓ యాడ్ కేంపెయిన్ చేస్తున్నారు. ప్యూర్ హెల్త్ లైఫ్ సర్వీసెస్ అనే సంస్థ 'వెల్ కేర్ హెల్త్ కార్డ్' అనే సర్వీస్ ప్రారంభిస్తోంది. ఈ కార్డ్ తో కేవలం 999తో కార్పొరేట్ హాస్పిటల్స్ లో సామాన్యులు వైద్యం చేయించుకుకోవచ్చు.

అయితే హీరో గోపీచంద్ కి ఈ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసి పేమెంట్ తీసుకోకుండా ఫ్రీగా దీనికి ప్రచారం చేయబోతున్నాడు. అలాగే ఈ విషయాన్ని తన ఫ్రెండ్ ప్రభాస్ కి కూడా చెప్పాడట. దాంతో నేను సైతం అంటూ ప్రభాస్ కూడా ఈ కార్యక్రమాన్ని లాంఛ్ చేయడానికి ముందుకి వచ్చాడట. ఈ కార్డ్ లాంఛింగ్ ఈవెంట్ కి ప్రభాస్ కూడా పైసా తీసుకోవడం లేదట. సామాన్యులకు..పేదలకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమానికి ఈ ఇద్దరు హీరోలు ముందుకి రావడం చాలా సంతోషం అని సినీ జనాలు మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:పెళ్ళిలో సందడి చేసిన చైతూ-సమంత జంట(ఫోటోలు)

ఇవి కూడా చదవండి:పవన్ యాక్షన్ కి బాబు రియాక్షన్

English summary

Tollywood Macho Hunk Gopichand and Rebel Star Prabhas were very good friends and recently Gopichand and Prabhas together came forward to do free campaign for Pure Health Life Services. With the help of these services normal people can take treatment in Big Hospitals for 999 rupees.