రచ్చ చేస్తున్న గోపీచంద్

Gopichand movie with Sampath Nandi

11:55 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Gopichand movie with Sampath Nandi

ఇదేమిటి అనుకుంటున్నారా? కంగారు పడకండి. అంతలేదు. గోపీచంద్ ప్రస్తుతం ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీ ఆక్సిజన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న తరుణంలో తాజాగా మరో కొత్త సినిమాకు గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. రచ్చ తో మాస్ డైరెక్టర్ గా మెప్పించిన సంపత్ నంది, ఆతర్వాత మాస్ మహారాజా రవితేజను బెంగాల్ టైగర్ గా తెరమీదకు తీసుకొచ్చాడు. తర్వాత చరణ్ తో మరో సినిమాకు ప్లాన్ చేశాడు.

చరణ్ కి కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో, గోపీచంద్ తో సినిమాకు ఈ యంగ్ డైరెక్టర్ ప్లాన్ చేశాడు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. శంఖం, రెబల్ చిత్రాలను నిర్మించిన జె.భగవాన్, జె.పుల్లారావులు ఈ సినిమా నిర్మించబోతున్నారట. అదండీ సంగతి.

English summary

Gopichand movie with Sampath Nandi