గోపిచంద్‌ 'ఆక్సిజన్‌' లోగో..

Gopichand Oxygen movie logo

01:37 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Gopichand Oxygen movie logo

మాచో హీరో గోపీచంద్‌ ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తూ తన జోరుని పెంచాడు. లౌక్యం, జిల్‌ వంటి వరుస విజయాలు తరువాత గోపీచంద్‌ నటించిన తాజా చిత్రం 'సౌఖ్యం'. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కాకమేందే గోపీచంద్ మరో చిత్రాన్ని కూడా అనౌన్స్‌ చేసేశాడు. గోపీచంద్‌, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఆక్సిజన్‌' అనే టైటిల్‌ ఖరారు చేయగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోని కూడా విడుదల చేసేశారు.

ఈ లోగోని చూస్తుంటే ఇది పక్కా యాక్షన్‌ మూవీ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి ఎ.ఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో జగపతిబాబు నటిస్తుండగా ఒక కీ రోల్‌లో 'కిక్'శ్యామ్ కనిపించనున్నాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary

Gopichand Oxygen movie logo released yesterday. This movie is directing by A.M Rathnam's son Jyothi Krishna and Rashi Khanna is pairing once again with Gopichand. Music is composing by Yuvan Shankar Raja.