మళ్లీ రొమాన్స్‌ మొదలెట్టిన 'గోపీ, రాశీఖన్నా'

gopichand pairing again

05:03 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

gopichand pairing again

'మనం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాలరాశీ రాశీఖన్నా. ముద్దుగా బొద్దుగా ఉన్నా మొదటి చిత్రంలో పద్ధతిగా నటించింది. ఆ తరువాత జోరు చిత్రంలో అందాలు ఒలకబోసింది. ఆ తరువాత గోపిచంద్‌ నటించిన జిల్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ కొట్టేసింది. తాజాగా మాస్‌మహారాజ్‌ రవితేజ నటించిన 'బెంగాల్‌ టైగర్‌' లో హీరోయిన్‌గా నటించింది. ఇది డిసెంబర్‌ లో విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న 'సుప్రీమ్‌' చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉండగా గోపిచంద్‌ కధానాయకుడిగా ఎ.ఎం. రత్నం తనయుడు ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది.

అందులో హీరోయిన్‌గా రాశిఖన్నాని ఎంపిక చేశారట. ప్రస్తుతం కధ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. రాశీకి గోపిచంద్‌తో ఇది రెండో సినిమా. ఈ చిత్రాన్ని జనవరిలో సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారు.

English summary

gopichand pairing again