'గొరిల్లా గ్లాస్-5' స్ర్కీన్ ఉంటే స్మార్ట్ ఫోన్ సేఫ్

Gorilla glass 5 screen is very safe for smartphones

01:25 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Gorilla glass 5 screen is very safe for smartphones

అందరి బాధా ఇదే. ఎందుకంటే, వేలరూపాయలు ఖర్చుపెట్టి ఎంతో ఇష్టంగా స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే గంటలు కూడా గడవకముందే అది చేతిలోంచో, జేబులోంచో జారిపడ్డమో, పైనుంచి కిందపడి పగిలిపోవడమో జరగడం వలన ఫోన్ దెబ్బతిని కుదేలయిపోతుంటాం. మనసు నిండా ఒకటే బాధ. అయ్యో! అంటూ దిగాలుగా కూర్చుంటాం. ఇక అలాంటి బాధలు, మనోవేదనలు అవసరంలేదని గొరిల్లా గ్లాస్ స్పష్టం చేస్తోంది. అవును ఇది వేసుకుంటే, ఫోన్ గ్లాస్ పగిలిపోతుందనే భయమే ఇక ఉండదట. అన్ బ్రేకబుల్ ఫోన్ స్ర్కీన్లు మార్కెట్ లోకి వచ్చేస్తాయట. మనలో అరవైశాతం మందికి ఫోన్ స్ర్కీన్లు పగలగొట్టుకోవడం నిత్యం పరిపాటే అయింది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్ళల్లోనే ఇది ఎక్కువ. పెద్దల అజాగ్రత్త వల్ల కూడా ఇలా జరుగుతుంది.

ఈ సమస్యలు పరిష్కరించేందుకు గొరిల్లా గ్లాస్-5 కొత్త వెర్షన్ మోడల్ స్ర్కీన్లు వచ్చేస్తున్నాయి. ఎత్తుమీంచి కిందపడినా కూడా ఈ గొరిల్లాగ్లాస్ స్క్రీన్ చెక్కుచెదరదట. సాధారణంగా సెల్ఫీలు తీసుకునేటప్పుడు సెల్ ఫోన్ ని చేత్తో గాలిలోకి దూరంగా ఎత్తిపట్టుకున్న సందర్భాల్లో ఫోన్ జారి పడిపోయినా గ్లాస్ ఇక పగలదట. అసలు బండరాతిపై పడ్డా, ముక్కలవకుండా స్మార్ట్ ఫోన్ సేఫ్ గా ఉంటుందట! ఈ కంపెనీ పరిశోధకులు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ కొత్త వెర్షన్ కనుగొన్నారు. 1.6 మీటర్ల ఎత్తునుంచి రాయిమీద పడినాగానీ ఈ స్మార్ట్ ఫోన్ గ్లాసులకు గ్యారంటీ ఉంటుందని చెబుతున్నారు.

కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్-జనరల్ మేనేజర్ జాన్ బేన్ మాట్లాడుతూ, 165 సంవత్సరాల చరిత్రగల తమ కంపెనీ ఈ కవర్ గ్లాస్ టెక్నాలజీలో సరికొత్త పుంతలు తొక్కిందన్నారు. ఎంత అననుకూలమైన వాతావరణంలోనైనా సెల్ఫీలు తీసుకోవడానికి ఈ స్క్రీన్లు ఎంతో అనువుగా ఉంటాయట. ఇక ఈ యేడాది పూర్తయ్యేనాటికి ఈ కొత్త వెర్షన్ గొరిల్లాగ్లాస్ స్క్రీన్లు మార్కెట్లోకి ప్రవేశిస్తాయట.

English summary

Gorilla glass 5 screen is very safe for smartphones