కార్లకు ‘గొరిల్లా గ్లాస్'..

Gorilla Glass For Cars

05:48 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Gorilla Glass For Cars

గొరిల్లా గ్లాస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగించేవారికి పరిచయం అవసరం లేని పేరు. డస్ట్, వాటర్ నుంచే కాక నెయిల్ స్క్రాచ్ ల నుంచి మన ఫోన్ ను కాపాడేందుకు ఈ గ్లాస్ ఉపయోగపడుతుంది. ఫోన్ కు రక్షణ అందించడంలో దీనికి ఇదే సాటి. ఇంతకుముందు స్క్రీన్ గార్డులు వాడే వారు గొరిల్లా గ్లాస్ వచ్చిన తర్వాత వాటి సంగతే మరిచిపోయారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 3, 4 పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం స్మార్ట్ ఫోన్ లలో దీనిని ఎక్కువగా వాడుతున్నారు. తాజా కబురు ఏమిటంటే గొరిల్లా గ్లాస్ ను ఇకపై కార్లలోనూ వినియోగించనున్నారు. ఇప్పటికే బీఎండబ్ల్యూ, ఫోర్డ్ తదితర కంపెనీలకు చెందిన స్పోర్ట్స్ కార్లలో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఆయా కార్లకు ముందు, వెనుక భాగాల్లో ఈ గ్లాస్‌ను అమర్చి పరీక్షిస్తున్నారు. ఇతర గ్లాస్‌లతో పోలిస్తే గొరిల్లా గ్లాస్ బరువు తక్కువగా, దృఢంగా ఉండడమే కాక దీన్ని కార్లలో వాడడం వల్ల కార్ల బరువు కూడా తగ్గి, మరింత మెరుగైన పనితీరు కనబరుస్తాయని నిపుణులు చెపుతున్నారు. అయితే ఇప్పుడు ఆయా కార్లలో కేవలం ముందు, వెనుక భాగాల్లోనే ఈ గ్లాస్‌ను వాడడం జరుగుతుందని, సైండ్ విండోలకు కూడా దీన్ని అమర్చి వాడి చూశాక వినియోగదారులకు అనువుగా ఉండేలా అందుబాటులోకి తెస్తామని కార్నింగ్ కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ గొరిల్లా గ్లాస్ ఉత్పత్తిని పెంచి మరిన్ని కార్లకు సరఫరా చేయనుందని తెలిసింది. త్వరలోనే గొరిల్లా గ్లాస్ అమర్చిన కార్లు మనకు అందుబాటులోకి రానున్నాయి. 2007 నుంచి గొరిల్లా గ్లాస్ ను ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.

English summary

We use gorilla glass for our smartphone. Now cars were also using Gorilla Glass In Cars.BMW car company was the first company to use Gorilla Glass last year. The gorilla glasswas used in interior panel in the i8 hybrid sports car