శాతకర్ణి ప్రీ-రిలీజ్ బిజినెస్ అదిరింది!

Goutamiputra Satakarni movie pre release business

04:09 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Goutamiputra Satakarni movie pre release business

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీ-రిలీజ్ బిజినెస్ జోరందుకుంటోంది. పైగా వందో చిత్రం కూడా కావడంతో పగడ్బందీగా రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కూడా అయిన సుధాకర్ రెడ్డి(గ్లోబల్ ఫిల్మ్స్) రూ.10.60 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే సీడెడ్ థియేట్రికల్ రైట్స్ ను బళ్ళారి సాయి 9 కోట్లకు సొంతం చేసుకున్నారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న శాతకర్ణి మూవీ షూటింగ్ వచ్చే నవంబరుకల్లా పూర్తి కావచ్చు. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కానుందని ఇప్పటికే ఫిలిం మేకర్స్ నిర్ణయించారు.

English summary

Goutamiputra Satakarni movie pre release business