రెండంకెల వృద్ధే లక్ష్యం కావాలన్న గవర్నర్‌ నరసింహన్‌ 

Governer Narasimhan On Republicday Parade

09:54 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Governer Narasimhan On Republicday Parade

ఎపిలో రెండంకెల వృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన భారత గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం, శకటాల ప్రదర్శన అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, హోం మంత్రి చినరాజప్ప, ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌, డీజీపీ జేవీరాముడు, రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రానున్న ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాక్ష్యాత్కారం కానుందని గవర్నర్ పేర్కొంటూ ఇందుకు అందరూ క్రుశిచేయాలన్నారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సులో రూ.4.70లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించా మని ఆయన చెబుతూ, పెట్టుబడుల ఆకర్షణే రాష్ట్రం వృద్ధివైపు పయనిస్తుందనేందుకు ఇది నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 19 నెలల అనతి కాలంలోనే రికార్డు స్థాయి వృద్ధి సాధించామన్నారు.వ్యవసాయ అనుబంధ రంగాల్లో తొలి అర్థ సంవత్సరంలోనే 29.17 శాతం వృద్ధి నమోదైందని, ఇక తయారీరంగంలో 6.7, సేవా రంగంలో 9.10 శాతం వృద్ధి నమోదైంద ని గవర్నర్ చెప్పారు. పంట సంజీవని పేరిట 10లక్షల నీటికుంటలు తవ్విస్తామన్నారు. కాగా నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ఆయన పేర్కొంటూ నదుల అనుసంధాన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెల్పారు.

English summary

Andhra Pradesh and Telangana states Governer Narasimhan Says that Both Andhra Pradesh and Telangana states have to develop in India.He participated in Andhra Pradesh Republic Day Parade which was conducted in Vijayawada