నోట్ల రద్దు నేపథ్యంలో కురిపించిన వరాలు ఇవే

Government Announces Various Discounts On Digital Payments

11:12 AM ON 9th December, 2016 By Mirchi Vilas

Government Announces Various Discounts On Digital Payments

రూ 500, రూ 1000 నోట్ల రద్దు ప్రకటన చేసి న తర్వాత దఫదఫాలుగా కొన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో నోట్ల రద్దు జరిగి నెల రోజులైన సందర్భంగా నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వరాలు ప్రకటించారు. గత నెల 8న ప్రధాని చేసిన నోట్ల రద్దు ప్రకటన తర్వాత నగదురహిత లావాదేవీలు 40శాతానికి పెరిగాయని జైట్లీ చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వరాలు ఏమిటంటే,...

1. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోల్ కొనేవారికి 0.75 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.

2. ఇక రైల్వే టికెట్లు ఆన్ లైన్ ద్వారా కొనేవారికి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తారు. ఒకవేళ నగదు ఇచ్చి కొనేవారికి ఎలాంటి ఇన్సూరెన్స్ కవరేజి ఉండదు.

3. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు డిజిటల్ పేమెంట్ చెల్లించేవారికి 10 శాతం డిస్కౌంట్ ఇస్తారు.

4. రైల్వే క్యాటరింగ్, విశ్రాంతి గదులకు సంబంధించి ఆన్ లైన్ పేమెంట్లు జరిపేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇస్తారు.

5. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు జరిపేవారికి 8 శాతం, సాధారణ బీమా పాలసీలకు 10 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.

6. కాగా లక్ష గ్రామాలకు స్వైపింగ్ యంత్రాలను పంపిస్తున్నారు.

English summary

Government Announces Various Discounts On Digital Payments