ఈపీఎఫ్‌ పన్నుపై కేంద్రం వెనక్కి

Government Back Step On EPFO Tax

04:55 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Government Back Step On EPFO Tax

బడ్జెట్ లో ప్రకటించిన ఈపీఎఫ్‌ పై పన్ను ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఈపీఎఫ్‌లో వెనక్కి తీసుకునే కొంత మొత్తంపై పన్ను విధిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. 2016 ఏప్రిల్‌ 1 తర్వాత ఈపీఎఫ్‌ ఉద్యోగి ఖాతాకు జమ అయ్యే మొత్తాల్లో 60 శాతం సొమ్ము ఉపసంహరణ సమయంలో పన్ను పరిధిలోకి వస్తుందని ప్రకటించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రైవేటు ఉద్యోగుల్లో అధికాదాయ వర్గాలు ఈపీఎఫ్‌ నుంచి అత్యధికంగా లబ్ధి పొందకుండా చూసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. 3.7 కోట్ల మంది ఈపీఎఫ్‌ చందాదారుల్లో ఎక్కువమందికి తాజా నిర్ణయం ప్రభావం ఏమీ ఉండదని పేర్కొంది.

పింఛను కోసమే ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదన చేశామని దానిని సరిగా అర్థం చేసుకోలేదని జైట్లీ వివరణ ఇచ్చారు. అయితే పీఎఫ్ పై పన్ను ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పార్లమెంట్‌లో విపక్షాలు జైట్లీపై మండిపడ్డాయి. ఈ నిర్ణయం ఈపీఎఫ్‌ సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లేలా కనిపిసస్తోందని ఆరోపించాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను రాయితీ, అధిక రాబడి కోసం ఉద్యోగులు తమ వేతనాల నుంచి సొంతంగా జమ చేస్తున్న వీపీఎఫ్‌ చందా.. వడ్డీ పన్ను నిర్ణయంతో తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. ఏటా రూ.లక్ష కోట్ల వరకు ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్‌కు డబ్బులు జమ అవుతుండగా, వీటిలో వీపీఎఫ్‌ వాటా సుమారు 20-30శాతం వరకు ఉంది. పన్ను ప్రతిపాదనతో వీపీఎఫ్‌ కింద దాచుకునేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపరనే భావన, కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

English summary

The government on Tuesday promised to consider demands for a rollback of the proposal to tax 60 per cent of withdrawals from provident fund.The government has made it clear that PPF will continue to be exempt from tax.