అధికాదాయం వుంటే,  రాయితీ కట్ 

Government Cuts LPG Gas Subsidy

03:30 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Government Cuts LPG Gas Subsidy

పన్ను విధించ దగ్గ ఆదాయం 10 లక్షల రూపాయలు దాటితే, వంట గ్యాస్ రాయితీ వుండదు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1961 ఆదాయపు పన్ను చట్టం కింద గణించిన ఆదాయం గత ఏడాది పన్ను విధించ తగ్గ ఆదాయం 10 లక్షలు దాటితే అధికాదాయం కింద లెక్క. అధికాదాయ వర్గాలు వంట గ్యాస్ సబ్సీడి స్వచ్చందంగా వదులుకోవాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కొంతమంది స్వచ్చందంగా గ్యాస్ సబ్సీడి వదులుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే అందుకనుగుణంగా రాయితీ కట్ విధానం ప్రకటించింది.

ప్రభావవంతమైన వ్యవస్ధను రూపోందించాక దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మినహా మిగిలిన అందరికీ వంటగ్యాస్‌ రాయితీని ఎత్తివేయాలని 2010 లో కిరీట్‌ పారిక్‌ కమిటీ సిఫార్సు చేయడంతో అందుకనుగుణంగా చర్యలు మొదలయ్యాయి.

అధార్‌తో వంటగ్యాస్‌ కనెక్షన్‌ అనుసంధాన ప్రక్రియ 2012 లో ప్రారంబించి , కొన్నాళ్ళు అమలు చేసారు. అయితే వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు అయితే వంటగ్యాస్‌ రాయితీకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం 2014 నుంచి పూర్తి స్ధాయిలో అమలు చేయడం ప్రారంభించారు.

ఈ పథకం అమలుతో నకిలీ కనెక్షన్లు, వినియోగంలో లేని కనెక్షన్లను తీసేయడంతో 14.78 కోట్లకు వంటగ్యాస్‌ వినియోగదారుల సంఖ్య తగ్గింది. అయితే అంతకు ముందు 16.35 కోట్ల కనెక్షన్లు ఉండేవి. వంటగ్యాస్‌ రాయితీకి ప్రభుత్వం 2014-15 లో రూ 40,551 కోట్లు చెల్లించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం పై రాయితీ భారం సగానికన్నా తక్కువకు తగ్గనుంది. ముడి చమురు ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవడమూ ప్రభావాన్ని చూపింది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రాయితీ రూపేణా రూ. 8,814 కోట్లు చెల్లించింది.

ఆ తర్వాత దశలో దంపతుల్లో ఎవరో ఒకరికి రూ.10 లక్షల అదాయం పరిమితి కాకుండా ఇద్దరికీ కలిపి రూ. 10 లక్షల అదాయ పరిమితిని పరిగణన లోకి తీసుకోవాలన్నది కిరీట్‌ పారిక్‌ అభిప్రాయం. ఆ తర్వాత దశలో దీన్ని రూ. 5 లక్షలుగా చేయవచ్చన్నది కూడా ఆయన అభిప్రాయం. మొత్తానికి వంట గ్యాస్ సబ్సీడి భారం చాలావరకు తగ్గనుంది.

English summary