హత్యకు గురైన డాక్టర్ - అసలేం జరిగింది?

Government Doctor Killed In Nandyal

11:07 AM ON 27th July, 2016 By Mirchi Vilas

Government Doctor Killed In Nandyal

కర్నూలులో అర్ధరాత్రి వేళ ఓ ప్రభుత్వ డాక్టర్ ని కొందరు యువకులు కిరాతకంగా హత్యచేశారు. వైద్యుడి మృతితో ఆయన కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ దారుణం వెనుక చోటుచేసుకున్న ఘటనల్లోకి వెళ్తే, శైలేంద్రరెడ్డి అనే వ్యక్తి కర్నూలులోని గాజులపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. ఐతే, డాక్టర్ శైలేంద్రరెడ్డి తన నలుగురు ఫ్రెండ్స్ తో సోమవారం రాత్రి నంద్యాలకు వచ్చాడు. పొద్దుపోయాక మద్యంమత్తులో ఇద్దరువ్యక్తులు గొడవపడ్డారు. పాపం, డాక్టర్ గారు మానవతా దృక్పధంతో వాళ్లను శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన దుండగులు ఒక్కసారిగా డాక్టర్ పై విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడి చేశారు.. తీవ్రగాయాలపాలైన డాక్టర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కొందరు వ్యక్తులు స్థానిక ఆసుపత్రికి డాక్టర్ ని తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీకెమెరా ఫుటేజ్ ద్వారా నిందితులను పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక ఎలాంటి పాత కక్షలు లేవని చెబుతున్నారు. అన్యాయంగా ఓ డాక్టర్ ప్రాణం గాల్లో కల్సిపోయిందని పలువురు ఆవేదన చెందారు.

ఇవి కూడా చదవండి:కోనసీమలోని రిసార్ట్స్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు(వీడియో)

ఇవి కూడా చదవండి:రొమాన్స్ తో అదర గొడుతున్న లావణ్య

English summary

A Government was killed brutally by some of the young boys in Nandyal in Kurnool District. The doctor was tried to stop the quarreling youth and they attacked doctor and killed him.