ఇకపై ఆ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే 3 ఏళ్ళు జైలు.. 3 లక్షల జరిమానా!

Government of India Banned Some Websites

10:49 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Government of India Banned Some Websites

అదేమిటి? వెబ్ సైట్ ఓపెన్ చేస్తే జైల్లో పెట్టడమేంటి అనుకుంటున్నారా ? అవును నిజం. కొన్ని సామాజిక కారణాల దృష్ట్యా కొన్ని వెబ్ సైట్స్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. వందల పోర్న్ వెబ్ సైట్స్ పై కొరడా ఝుళిపించింది. యువత ఆలోచనలను పెడతోవ పట్టించే విధంగా ఈ సైట్స్ ఉన్నాయని, అందుకే వీటిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బ్యాన్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో కొంతవరకూ వెనక్కి తగ్గింది. కొన్ని వెబ్ సైట్లను మాత్రమే నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇటీవలే టొరెంట్జ్ వెబ్ సైట్ ను మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయినా ఇప్పటికీ చాలామంది ఈ సైట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్ సైట్ ను నెట్ లో సెర్చ్ చేయగానే ఓ సందేశం కనిపిస్తుంది. ఈ వెబ్ సైట్ ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా నిషేధించబడింది. ఈ వెబ్ సైట్ ను వెతికినా, ఫైల్స్ డౌన్ లోడ్ చేయడానికి ప్రయత్నించినా, డూప్లికెట్ చేయడానికి ప్రయత్నించినా 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 3లక్షల జరిమానా అనేది ఈ సందేశంలోని సారాంశం. అందుకే టొరెంట్ ఫైల్స్ జోలికి వెళ్లకపోతే మంచిది కదా అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:మెగా మూవీకి టైటిల్ ఖరారు!

ఇవి కూడా చదవండి:మెగా బర్త్ డే వేడుకల్లో చిందేసిన అల్లు శిరీష్(ఫోటోలు)

English summary

Government of India banned some porn websites and some other websites in India. Recently Torrentz site have been banned by Indian Government and still so many people were searching for this website in India and Government posted a warning message that if anyone tried to download any content or to crate a duplicate then the user have to face some legal problems.