24 క్యారెట్ల బంగారం దిగుమతులు పై నిషేదం

Government To Ban Imports Of 24 Carat Gold Jewellery

01:36 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Government To Ban Imports Of 24 Carat Gold Jewellery

భారత ప్రభుత్వం 24 క్యారెట్ల బంగారం దిగుమతుల పై నిషేదం విధించనుంది. ప్రభుత్వం ఆసియా దేశాలలో వాణిజ్య ఒప్పందాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు 24 క్యారెట్ల బంగారు ఆభరణాల దిగుమతులను నిషేదించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.

ప్రపంచంలో రెండవ అతి పెద్ద బంగారు వినియోగదారులైన భారత్‌లో బంగారం డిమాండ్‌ను అరికట్టేందుకు 2013 లో బంగారు దిగుమతులపై సుంకాన్ని 10 శాతం పెంచారు. కానీ ఆ చర్యతో బంగారం స్మగ్లింగ్‌, భారత FTA వారు అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌తో ఉన్న నిబంధనలను ఉపయోగించుకుని కేవలం రెండు శాతం దిగుమతి సుంకంతో బంగారు దిగుమతులు బాగా పెరిగిపోయినందున ఈ చట్టాన్ని తీసుకురాబోతునట్లు సమాచారం. అలా దిగుమతి చేసుకున్న బంగారు నగలను కరిగించి కాయిన్స్‌, బిస్కట్లు రూపంలో మార్చి స్థానిక బంగారం మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు సమాచారం.

దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఉన్న విధి విధానాలలో మార్పులు చేసి కేవలం 18,22 క్యారెట్లు ఉన్న బంగారం నగలను మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అనుమతించే విధంగా మార్పులు చెయ్యడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

English summary

Indian government is planning to ban imports of 24-carat gold jewellery to avoid smugling of gold and ileegal import of gold in India.The imported jewellery is then melted to make coins and bars and sold in the local market