భారీ జరిమానాలతో యాక్సిడెంట్లకు చెక్!

Government To Bring Motor Vehicle Amendment Bill

11:08 AM ON 4th August, 2016 By Mirchi Vilas

Government To Bring Motor Vehicle Amendment Bill

రోజూ ఏ ఛానెల్ చూసినా, ఏ పత్రిక చూసినా ఏక్సిడెంట్స్ వార్తలే ... అందుకే రోడ్డు ప్రమాదాలకిక చెక్ పెట్టాలని మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016 ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అతి వేగంగా వాహనం నడిపితే వెయ్యి నుంచి 4 వేల దాకా, కారులో సీటు బెల్టు పెట్టుకోకపోతే వెయ్యి, ఇన్సూరెన్స్ లేకుంటే 2 వేలు జరిమానా, మూడు నెలల జైలు శిక్ష,..ఇలా సరికొత్త నిబంధనలు నిర్దేశించారు. అంతేగాక.మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలవరకూ జరిమానా వసూలు చేస్తారు.

మైనర్లు ప్రమాదాలు చేస్తే వారి తలిదండ్రులపైనా, సదరు వాహన యజమానులపైనా కేసులు పెడతారు. రూ. 25 వేల ఫైన్, మూడేళ్ళ జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. హిట్ అండ్ రన్ బాధితులకు రూ. 2 లక్షలు, ప్రమాద మృతులకు రూ. 10 లక్షల సాయం అందించాలని ఈ బిల్లు పేర్కొంటోంది.ఈ చట్టం అమల్లోకి వస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:కూలిన వంతెన-కొట్టుకుపోయిన బస్సులు-జనం మిస్సింగ్

ఇవి కూడా చదవండి:వామ్మో, స్కూటర్ ఏక్సిడెంట్ .. 5అడుగుల ఎత్తు నుంచి ..(వీడియో)

English summary

Indian Government was thinking to bring new bill to reduce Motor Vehicle Accidents. Government was planning to bring that rules to reduce accidents by huge fine basting to motor vehicle accidents.