ప్రయాణికులకు రైల్వే షాక్?

Government To Increase Railway Charges

11:21 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Government To Increase Railway Charges

రైలు ప్రయాణికులకు మరో షాక్ తగలనుంది. నిధుల కొరత కారణంగా సాధారణ ప్రయాణ చార్జీలు పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. రానున్న రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికుల చార్జీలను 5 నుంచి 10 శాతం పెంచే అవకాశం ఉంది. ప్రయాణ, సరుకు రవాణా చార్జీల ద్వారా ఏటా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గడంతో రైల్వే శాఖ చార్జీల పెంపు అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికి తోడు ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు రూ. 32 వేల కోట్ల అదనపు భారం పడటం.. బడ్జెట్ తోడ్పాటు కింద రైల్వేలకు ఇచ్చే నిధుల్లో 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ రూ. 8 వేల కోట్ల మేరకు కోత విధించడమూ ఈ ప్రతిపాదనకు ఊతం ఇస్తోంది. ప్రయాణికుల చార్జీల, సరుకు రవాణా చార్జీల పెంపుతో పాటు పలు ప్రతిపాదనలు ఉన్నాయని, ఇప్పటి వరకూ దేనిపైనా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ప్రయాణ చార్జీలు పెంచాలా లేదా అనే దాని పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపాయి. మార్చిలో వేసవి సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణాల జోరు పెరిగే నేపథ్యంలో చార్జీలు పెంచి సొమ్ము చేసుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో అన్ని రకాల ప్రయాణ చార్జీలను 14 శాతం పెంచింది. గత ఏడాది మరో పది శాతం పెంచింది.

English summary

Central Government to increase railway charges by 14 percent for the first time in this year.Due to failing to meet its annual revenue targets Indian Railways had taken this decision to increase fare