23న మరికొన్ని నేతాజీ ఫైళ్ల విడుదల

Govt to release second set of Netaji files

11:01 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Govt to release second set of Netaji files

స్వాతంత్ర్య సమర యోధుడు, ఆజద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు సంబంధించిన మరికొన్ని ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. బోస్ కు సంబంధించిన 25 రహస్య ఫైళ్లను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్‌శర్మ పేర్కొన్నారు. ప్రతి నెలా 25 రహస్య దస్త్రాలను విడుదల చేస్తామని, ఈ నెలలో బహిర్గత పరచాల్సిన దస్త్రాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గత జనవరి 23న నేతాజీ 119వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వంద రహస్య దస్త్రాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23న మరో 25 ఫైళ్లను నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా బయటపెట్టనుంది.

English summary

Indian Culture Minister Mahesh Sharma says that Government is going to be released second tranche of 25 Netaji files this month.