గౌతమీ పుత్రకు మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడోచ్

Gowthami Putra Satakarni Got Music Director

11:08 AM ON 13th August, 2016 By Mirchi Vilas

Gowthami Putra Satakarni Got Music Director

నందమూరి నటసింహం బాలయ్య వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నేపథ్యంలో, పని ఒత్తిడి కారణంగా ఈ మూవీ నుంచి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తప్పుకున్నాడు . దీంతో సంగీత దర్శకుడిని వెతికే పనిలో పడిన హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ కల్సి మొత్తానికి ఓ మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టేసారు.

వాస్తవానికి ఇలాంటి చారిత్రక నేపథ్యమున్న సినిమాలకు సంగీతాన్నందించడంలో సిద్ధహస్తులయిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాను గానీ, ఎమ్ ఎమ్ కీరవాణిని గానీ తీసుకోవాలని చిత్ర దర్శకుడు క్రిష్ , హీరో బాలకృష్ణ భావించారు. దేవీ స్థానంలో వీరిద్ద రిలో ఒకరిని తీసుకోవాలని భావించినా, చివరకు విరమించుకున్నారు. ఎందుకంటే, వారితో కూడా ఇలాంటి ఒత్తిడి సమస్యే వచ్చే అవకాశ ముందున్న ఉద్దేశ్యంతో రిస్క్ తీసుకోకుండా, ‘కంచె’ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్ భట్ నే క్రిష్ ఎప్రోచ్ అయ్యాడట. ఇక మరోమాట మాట్లాడకుండా, భట్ హ్యాపీగా అంగీకరించాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు కొత్త సంగీత దర్శకుడు దొరికేసాడు. ఇక ఈమూవీలో బాలయ్య తల్లిగా హేమమాలిని, భార్యగా శ్రియ నటిస్తున్నారు.

ఇది కూడా చూడండి: కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

ఇది కూడా చూడండి: ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

English summary

Gowthami Putra Satakarni Got Amazing Music Director