లంక క్రికెట్‌ టీమ్ కోచ్‌గా గ్రాహమ్‌ ఫోర్డ్‌

Graham Ford Selected As New Coach For Srilanka

11:40 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Graham Ford  Selected As New Coach For Srilanka

శ్రీలంక క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన గ్రాహమ్‌ ఫోర్డ్‌ ఎంపికయ్యాడు. గత సెప్టెంబర్‌లో మార్వన్‌ ఆటపట్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి నూతన కోచ్‌ వేటలో పడిన శ్రీలంక క్రికెట్‌ సంఘం ఐదు నెలల అనంతరం గ్రాహమ్‌ ఫోర్డ్‌ను ఎంపిక చేసింది. కోచ్‌గా గ్రాహమ్‌ ఫోర్డ్‌తో పాటు బంగ్లాదేశ్‌ కోచ్‌ చండికా హతురుసింగా పేర్లను పరిశీలించారు. అయితే గతంలో కోచ్‌గా పనిచేసిన గ్రాహమ్‌ పనితీరుపై సంతృప్తిగా ఉన్న శ్రీలంక బోర్డు ఆయనకే ఓటు వేసింది. 2012లో తొలిసారి శ్రీలంక కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫోర్డ్‌ 2014లో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. మళ్లీ రెండేళ్ల తర్వాత కోచ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరించనున్న ఫోర్డ్‌ 2019 ప్రపంచకప్‌ వరకు శ్రీలంక కోచ్‌గా పనిచేయనున్నాడు.

English summary

Former South Africa coach Graham Ford confirmed as Sri Lanka cricket team head coach.Graham Ford will be in charge for Sri Lanka’s tour of England this year.