సందడి చేసిన ఒలింపిక్స్ ముగింపు వేడుకలు

Grand finishing in Rio closing ceremony

11:36 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Grand finishing in Rio closing ceremony

విశ్వ క్రీడా పోటీలు ముగిశాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకు రియో డి జనీరోలో పోటాపోటీగా సాగిన ఒలింపిక్స్-2016 ముగింపు వేడుకలకు మారకానా స్టేడియం వేదికైంది. ఆరంభ వేడుకలను కూడా ఇదే స్టేడియంలో నిర్వహించారు. కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, కళాకారుల నృత్యాలతో స్టేడియం మారుమోగింది. ఆయా దేశాల జాతీయ జెండాలతో అథ్లెట్లు కవాతు నిర్వహించారు. బ్రెజిల్ సంస్కృతి, ప్రత్యేకతలను చాటుతూ కళాకారులు ప్రదర్శనలిచ్చారు.

1/5 Pages

భారత పతాకధారి సాక్షి మాలిక్...


రెజ్లింగ్ లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో భారత పతాకధారిగా వ్యవహరించింది. జాతీయ జెండాను చేబూని ఈ కార్యక్రమంలో పాల్గొంది. రజతం సాధించిన పీవీ సింధు భారత్ కు చేరుకోవడంతో భారత పతాకధారిగా సాక్షిని ఎంపిక చేశారు.

English summary

Grand finishing in Rio closing ceremony