కూతురి కోసం అమ్మగా మారిన అమ్మమ్మ 

Grand Mother Becomes Mother

05:45 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Grand Mother Becomes Mother

సంతాన భాగ్యంలేదని కన్న పేగు బంధం కుమిలిపోతుంటే, తట్టుకోలేకపోయిన ఓ తల్లి 54 ఏళ్ళ వయస్సులో, తానే గర్భ దాతగా మారి, పండంటి బిడ్డను కని, అందించింది. అమ్మమ్మే అమ్మగా అవతారం దాల్చి,మనవరాలిని కని, కూతురిని అమ్మగా చేసి, మరీ మురిసిపోయింది. మనుషుల నడుమ అనుబంధాన్ని పెనవేసే ఈ అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

వివరాలు పరిశీలిస్తే, అమెరికాకు చెందిన 54 ఏళ్ల ట్రేసీ థాంప్సన్‌ కుమార్తె కెల్లి(28), అల్లుడు అరోన్‌ మెక్‌ఇసాక్‌ లు మూడేళ్ల నుంచి పిల్లల కోసం పరితపించారు. వైద్య సహాయం తీసుకున్నప్పటికీ మూడు సార్లు గర్భస్రావ మైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, కృత్రిమ గర్భధారణ పద్ధతులను అవలంబించినా కూడా ఫలితం లేకపోయింది. దంపతులిద్దరూ కన్నీరుమున్నీరయ్యారు. సంతానం కోసం కుమార్తె పడుతున్న తపన గమనించిన ట్రేసీ థాంప్సన్‌ కుమార్తె కోసం అద్దె గర్భదాత అవతారం ఎత్తి పండంటి బిడ్డను కనిపెట్టింది. వాస్తవానికి 54 ట్రేసీ థాంప్సన్‌ మెనోపాజ్‌ దాటిపోయి ఏడేళ్లయింది. అయినా ఆమె ఆరోగ్యం బానే ఉన్నట్లు వైద్యులు వివిధ పరీక్షల అనంతరం తేల్చారు.

ఈ నేపధ్యంలో కుమార్తె కెల్లీ నుంచి సేకరించిన పిండాన్ని ట్రాసీ గర్భంలోకి ప్రవేశపెట్టారు.గర్భం దాల్చిన ట్రేసీ ఈ నెల 6న ఆరు పౌండ్లు బరువున్న ఆరోగ్యవంతమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక కెల్లీ, ఆరోన్‌ దంపతులు ఆనందానికి అవధుల్లేవు. తల్లి గర్భం ద్వారా జన్మించిన తన బిడ్డను చూసుకున్న కెల్లీ ఉద్వేగంతో మూగబోయింది. అందుకే, తమ కలల పంటకు అమ్మపేరు కలిసి వచ్చేలా ట్రేసీ అండ్‌ కెల్లీ అని నామకరణం చేసుకుంది.

ఇక్కడ ఓ ట్విస్ట్ వుంది. అదేమంటే, ‘‘అమ్మా ఒకవేళ నేను గర్భందాల్చ లేకుంటే, నాకోసం నువ్వాపనిచేస్తావా!’ అంటూ టీనేజరుగా ఉన్న కెల్లీ ఓ రోజు చిలిపిగా తల్లిని అడిగింది. అందుకు ట్రేసీ స్పందిస్తూ, .అలాగే అంటూ సమాధానమిచ్చింది. కానీ చివరకు అదే నిజమైంది. ఎప్పుడో చిన్నప్పడు అన్నమాట ఇన్నేళ్ల తర్వాత నిజమవ్వడం తో ట్రేసీ ఆశ్చర్యం, ఒకింత విజయ గర్వం వ్యక్తం చేసింది.

English summary

A 54 year old gives birth to a baby in behalf of her daughter . This rare incident was occured in America