గ్రాండ్ ఓపెనింగ్.. రియోలో ఒలంపిక్స్

Grand opening for olympics

10:27 AM ON 6th August, 2016 By Mirchi Vilas

Grand opening for olympics

విశ్వ క్రీడా సంబరం గ్రాండ్ గా ప్రారంభమైంది. క్రీడాభిమానులు మురిసే, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్ కు తెరలేచింది. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, అథ్లెట్ల కవాతులు, అలరించే నృత్యాల మధ్య రియోలోని మారకానా స్టేడియంలో 31వ ఒలింపిక్స్ క్రీడా ఆరంభ వేడుకలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున మొదలైన క్రీడా సంబరంలో అతిరధ మహారధులు పాల్గొన్నారు. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన ఆరంభ వేడుకలు అదుర్స్ అనిపించాయి. విద్యుత్ దీపాలతో స్టేడియాలు వెలిగిపోయాయి.

మైదానంలో ఆరువేల మంది కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఇక కళ్ళు చెదిరే కల్చరల్ ఈవెంట్స్ కనువిందు చేశాయి. ఫుట్ బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడలకు శుభారంభం పలికారు. గత ఒలింపిక్స్ లో భారత్ కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రా.. వేడుకల్లో జాతీయ జెండాతో భారత్ టీమ్ ని నడిపించాడు. ఆగస్టు 21 వరకు మొత్తం 37 వేదికల్లో పోటీలు జరగనున్నాయి. కాగా ఈసారి ఒలింపిక్స్ బరిలో భారత్ నుంచి 118 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. వందమందికిపైగా భారత క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. ఇక మనవాళ్ళు పతకాల పంట పండించాలని పలువురు క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

English summary

Grand opening for olympics