అమెరికాలో బాలయ్య రేంజ్ చూస్తే, షాక్ ..

Grand welcome for Balakrishna in America

11:04 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Grand welcome for Balakrishna in America

ఎపిలోనే కాదు .. అమెరికాలో కూడా నందమూరి బాలయ్యకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే - టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్ళాడు. ఇండియా నుంచి వెళ్లి అక్కడ కాలు మోపగానే భారీ రేంజిలో స్వాగతం లభించింది. సియాటెల్ విమానాశ్రయంకు చేరుకున్న బాలయ్యకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి బాలయ్య బస చేయనున్న హోటల్ వరకు పెద్ద సంఖ్యలో కార్లతో ర్యాలీ నిర్వహించిన అభిమానులు మరపురాని రీతిలో స్వాగతం ఇచ్చారు. ఇక బాలయ్యతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. తనకు భారీ రేంజిలో ఫాలోయింగ్ ఉండడం.. అభిమానులు అంతగా ఆదరించడంతో బాలయ్య కూడా తెగ ఖుషీ అయ్యాడట. 5పదుల వయసులోనూ విదేశాల్లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో బాలయ్యను చూసి టాలీవుడ్ యంగ్ హీరోలు నోరెళ్ల బెడుతున్నారట.

అమెరికా పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నడుస్తున్న బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిని మరింత ఆధునికీకరించేందుకు బాలయ్య నిధుల సేకరణ చేపట్ట బోతున్నాడు. సియాటెల్ లో ఆయన అభిమానులు నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యాడు. అక్కడ బాగానే గిట్టుబాటయినట్లు టాక్. ఇక ఈ నెల 10న కాలిఫోర్నియాలో అభిమానులు నిర్వహించే తన జన్మదిన వేడుకల్లో పాల్గొంటాడు.

అయితే... అభిమానులు చుట్టుముడుతున్నా కూడా బాలయ్య చిరాకు పడకుండా వారితో ముచ్చట్లాడుతున్నాడట. సెల్ఫీలు దిగేందుకు వస్తున్నవారితో మాత్రం ఆయన కాస్త ఇబ్బందిపడుతున్నా నిధులు కావాలంటే ఈమాత్రం భరించక తప్పదని సర్దుకుపోతున్నాడట. మొత్తానికి బాలయ్య రేంజ్ విదేశాల్లో కూడా అదిరిపోతోంది.

ఇది కూడా చూడండి:33 ఏళ్ళ వయసులో కూడా తరగని అందం(ఫోటోలు)

ఇది కూడా చూడండి:దిష్టి మంత్రం గురించి తెలిస్తే షాకవుతారు!

ఇది కూడా చూడండి:జూన్ నెలలో పుట్టిన వారి విశిష్ట లక్షణాలు

English summary

Grand welcome for Balakrishna in America.