గేర్లు వేయక్కరలేదు ... ఆటోమేటిక్ కార్లకు డిమాండ్

Great Demand For Automatic Gear Shift Cars

12:15 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Great Demand For Automatic Gear Shift Cars

కారున్నా సరే సమయానికి గమ్యానికి చేరుకోలేని దుస్థితి. గతుకుల రోడ్లు, గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ లు, వంటి సమస్యలతో విసిగి వేసారి పోతున్నారు. ఫలితంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఒక చిన్న మార్పుతో ఇప్పుడు పాటలు పాడుకుంటూ హాయిగా వెళ్లిపోయే పరిస్థితి వచ్చేసింది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గల కార్లు. ఈ కార్లలో గేరు మార్చే అవసరం ఉండదు. దీంతో సులభంగా కారును నడపొచ్చు. ఇక మాటి మాటికి గేర్లు మార్చే అవసరం లేకపోవడంతో శారీరక శ్రమ సగానికి పైగా తగ్గి, ఉత్సాహంగా సైతం పనిచేస్తున్నా మని చాలామంది అంటున్నారు.

మధ్యతరగతి ప్రజలకు కార్లు రోజురోజుకూ చేరువవుతున్నాయి. కొనుగోలు సామర్ధ్యం పెరగడం, మారుతున్న వారి అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ప్రస్తుతమున్న మోడళ్లలో ఆటోమేటిక్ వేరియంట్లనే కాకుండా.. కొత్త కొత్త మోడళ్లను సైతం రంగంలోకి దించుతున్నాయి. రూ.3-5 లక్షలకే చిన్న కార్ల ధరలను నిర్ణయిస్తూ వూరిస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి మనసులను దోచుకుంటున్నది మాత్రం ఆటోమేటిక్ కార్లే కావడం విశేషం. ఇంతకాలం ఖరీదైన కార్లకు మాత్రమే పరిమితమైన ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ, ప్రస్తుతం ఎంట్రీ లెవల్ కార్ల (చిన్న కార్లు)లో సైతం వచ్చేసింది.

నగరాల్లో జీవించేవారికి ట్రాఫిక్ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే ట్రెండ్ మారింది. ఆటోమేటిక్ కార్లపై మొగ్గు చూపుతున్నారు. కొత్త తరం వెర్షన్లు ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఏఎంటీ)ను అందిపుచ్చుకోవడంతో ఎక్కువ మైలేజీను అందివ్వడం, ధరలు అందుబాటులోకి రావడం కలిసొస్తున్నాయి. దీంతో వీటి అమ్మకాలు పరుగులు పెడుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మాత్రం భారత్ వెనుకబడే ఉంది. అమెరికాలో 80 శాతం కార్లు ఆటోమేటిక్ వెర్షన్లే కావడం విశేషం. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపడటం భారత్ కు అమ్మకాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

1/6 Pages

మారుతీ ఆల్టో కే10 ....

దేశంలో అతిపెద్ద వాహన సంస్థ మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఒకటి. దీని ధర రూ.4.02- 4.12 లక్షలు (ఎక్స్ -షోరూమ్ ) 1.0 లీటర్ ఇంజిన్ తో 67 హార్స్ పవర్ అందిస్తుంది 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ యూనిట్ ఉంటుంది. లీటరుకు 24.07 కి.మీ మైలేజ్ వస్తుంది.

English summary

Cars usage have been increased in our country in past few years and now people are attracting to Automatic gear shift cars and they were showing interest to buy Automatic Gear Shift Cars. Due to this demand so many companies were launching their automatic gear shift cars.