బ్లాక్ రైస్ కి  మళ్ళీ గిరాకీ

Great Demand For Black Rice

03:33 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Great Demand For Black Rice

ఒకప్పుడు ఔషధం విలువలు కలిగిన ఆహారంపైనే దృష్టి పెట్టేవారు. అందుకే పూర్వీకులు తమకు అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాల వంగడాలను తరతరాలుగా పరిరక్షిస్తూ వచ్చారు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎక్కువ మోతాదులో తీసుకు రావడం కారణంగా హైబ్రీడ్ వంగడాలు హెచ్చాయి. దీంతో ఔషధ విలువలతో కూడిన సంప్రదాయ వంగడాలు తగ్గుముఖం పట్టాయి. అయితే,ఇతీఅల మళ్ళీ విశిష్ట ఔషధ విలువలతో కూడిన దేశీ వరి వంగడాలపై ఆసక్తి పెరుగుతూ, వస్తోంది. ఫలితంగా సాంప్రదాయ సాగు కి మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఈ దశలో అపురూపమైన వరి వంగడాల్లో ‘బ్లాక్ రైస్’ కి మళ్ళీ ఊపిరి పోసినట్లయింది. కరువు పరిస్థితుల్లోనూ దిగుబడినివ్వడం ప్రత్యేక లక్షణం గల బ్లాక్ రైస్ వంగడాల బియ్యం కారు నలుపులో అలాగే ఊదా రంగులో ఉంటాయి. కేన్సర్‌ నిరో దించే గుణం పుష్కలంగా వీటికి వున్నాయని అంటారు. పైగా చైనాకు చెందిన కేన్సర్ నిపుణుడు లి పుంగ్ లియో అతని బృందం జరిపిన పరిశోధనలో ముఖ్యంగా బ్లాక్ రైస్‌లో కేన్సర్ నిరోధక పదార్థాలు మెండుగా ఉన్నాయని తేల్చాడు. మామూలు బియ్యంతో పోలిస్తే బ్లాక్‌రైస్‌లో విటమిన్ బీ, నియాసిన్, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్, పీచు పదార్థాలు వంటి పోషకాల మోతాదు అధికమని భారతీయ జీవ వనరులు, సుస్థిర సేద్యం అభివృద్ధి సంస్థ (ఐబీఎస్‌డీ) ప్రకటించింది. దీనికి తోడు రాజులకు ప్రియమైన ఆహారంగా పేరొందిన బ్లాక్ రైస్ వంగడాలు విశ్యవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపిస్తాయి.

ఇక మన దేశంలోని మణిపూర్ సంప్రదాయ వైద్యంలో బ్లాక్ రైస్ ఔషధంగా వాడతారట. సామూహిక ఉత్సవాల్లో బ్లాక్ రైస్‌తో వండిన ‘చాక్‌హావో’ అనే వంటకాన్ని వడ్డిస్తారు. మణిపూర్‌లో బ్లాక్ రైస్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ నడుం బిగించింది. బ్లాక్ రైస్ వంగడం కరవు పరిస్థితులను తట్టుకొని పెరుగుతుందని మణిపూర్‌కు చెందిన అభ్యుదయ రైతు లు చెప్పే మాట. ఇక ఇటీవలి కాలంలో మణిపూర్ లోనే కాకుండా అసోం, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో స్వల్ప విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ అక్కడక్కడా ప్రకృతి వ్యవసాయదారులు రెడ్ రైస్‌ను సాగు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి, గ్రామానికి చెందిన ఓ రైతు రెండేళ్ల నుంచి బ్లాక్ రైస్‌ను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేస్తూ, ఎకరానికి 20 బస్తాల (75 కిలోలు) వరకు దిగుబడి సాదిస్తున్నాడట. 4 నెలల పంటకాలం గల బ్లాక్ రైస్ వంగడాలను మణిపూర్ నుంచి ఈ ఏడాది తీసుకొచ్చి, సాగుచేస్తున్నాడు. వీటిల్లో సుగంధాన్నిచ్చే బ్లాక్ రైస్ కూడా ఒకటి. రెడ్ రైస్ (నవర)ను కూడా ఎకరంలో సాగు చేస్తున్నాడట.

సేంద్రియ బ్లాక్ రైస్‌కు విదేశాల్లో కిలో 300 రూపాయల ధర లభిస్తుండటంతో అసోం ప్రభుత్వం సేంద్రియ బ్లాక్ రైస్ సాగును విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తోంది. గొల్పారా జిల్లా అముగురిపారాలో రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాలతో బ్లాక్‌రైస్‌ను ఇప్పటికే సాగు చేస్తున్నారు. అలాగే బ్లాక్‌రైస్ సాగు పెంచేందుకు బెంగాల్ వ్యవసాయ శాఖ కూడా సన్నద్ధమవుతోంది.

English summary

The black rice (not the glutinous black rice) also known as "forbidden rice" is a range of rice type. It has an interesting history.Apart from the name of "forbidden rice", it is also called "emperor rice" or "fortune rice".It is a medium grain rice with nutty flavor and whole grain texture.It is black color and it turns dark purple when it cooked.