వైజాగ్ లో హొటల్ బిజినెస్ షురూ 

Great Demand For Hotels In Vishakapatnam

06:58 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Great Demand For Hotels In Vishakapatnam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీ కి చాల నష్టం వాటిల్లిందని అంతా అంటున్న విషయం తెలిసిందే. ఐతే కొన్ని అంశాల్లో మాత్రం లాభం చేకూరిందనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తరువాత అంతటి స్థాయిలో అభివృద్ధి చెందినదిగా సిటీ గా విశాఖపట్నం ముందుంటుంది. రాష్ట్ర విబజనకు ముందు ముందు అందరి దృష్టి హైదరాబాదు పైనే ఉండేది.... విభజన తరువాత మాత్రం అందరి కళ్ళు వైజాగ్ మీదనే. రాజధాని ప్రాంతాలైన విజయవాడ , గుంటూరుల్లో వసతులు ఇంకా అనుకునంత స్థాయిలో లేకపోవడం ,మెట్రో కల్చర్ కూడా లేకపోవడంతో అలాంటి వసతులు , జీవన విధానం ఉన్న విశాఖపట్నం కు కలిసొచ్చింది అనే చెప్పాలి.

అనేక విధమైన అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలను వైజాగ్ లో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే అనేక పరిశ్రమలు కలిగిన విశాఖ కు మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. అత్యధిక సముద్ర తీరం కలిగిన విశాఖ కు పర్యాటకుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇలాంటి వివిధ రకమైన అతిధులతో కళకళాలాడుతుండడం తో విశాఖ లోని హొటల్ పరిశ్రమ ఊపందుకుంది. వివిధ మీటింగ్ లు , వర్క్ షాప్ ల తో విశాఖ లోని హొటళ్ళు రద్దీ గా మారుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు విశాఖ లోని హోటళ్ళలో 60 శాతం అక్యూపెన్సీ ఉండగా ఇప్పుడది 100 శాతంకు చేరుకుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఐతే నెల రోజులు ముందు కుడా హోటళ్ళలో రూం లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ డిమాండ్ తో హోటల్ రూమ్ ల ధరలు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి.

విశాఖపట్నంలో ప్రస్తుతం 15 స్టార్ హోటళ్ళు వుండగా , 200 లాడ్జిలు , మరో 200 మాములు హోటళ్ళు ఉన్నాయి. ఇంతటి డిమాండ్ దృష్ట్యా రాబోయే కాలంలో మరిన్ని హోటళ్ళు విశాఖకు రానున్నాయి.

English summary

Hotel Business is Increasing day by day in Vishakapatnam. There is great growth in hotel business in vishakapatnam. Due to state bufirification of andhra pradesh all looks on vizag. Vizag Named to its metro culture, star hotels etc