లెనోవో కే4 నోట్‌కు ఫుల్ క్రేజ్

Great Demand For Lenovo K4 Note

04:15 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Great Demand For Lenovo K4 Note

చైనాకు చెందిన మొబైల్ ఫోన్ దిగ్గజం లెనోవో విడుదల చేస్తున్న వైబ్‌ కే4 నోట్‌ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫోన్ ఫీచర్లు కేక పెట్టించేలా ఉండటంతో దీనికి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కు ముందస్తు రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్‌ కోసం రెండు లక్షల మందికిపైగా రిజిస్టర్‌ చేసుకున్నారు. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ఫ్లాష్ సేల్ లో ఈ ఫోన్‌ను అమ్మనున్నట్టు లెనోవో ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 19న కే4 నోట్ ఫ్లాష్ సేల్ జరగనుంది. లెనోవో కే4 నోట్ ధర రూ.11,998. 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 16 జీబీ అంతర్గత మెమొరీ, 1.3 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3,300ఎంఏహెచ్‌ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు వేరియంట్లలో లభించనున్న సంగతి తెలిసిందే. రూ.12,499 చెల్లిస్తే స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఈ హెడ్‌సెట్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు.

English summary

Recently Lenovo company launched K4 note and this phone gets huge response in market.This phone was exclusively available on Amazon website.