ప్రిన్స్‌ చార్లెస్‌.. ద ఆర్టిస్ట్

Great Demand To Prince Charles Paintings

05:00 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Great Demand To Prince Charles Paintings

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్‌ గీసిన చిత్రాలు, వాటి ప్రతులకు బ్రిటన్ లో యమా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయన సంపాదన దేశంలోని అత్యున్నత కళాకారులను మించిపోతోంది. ఇటీవల క్లారెన్స్‌ హౌస్‌ అనే సంస్థ నిర్వహించిన విశ్లేషణలో ఈ విషయం బయటపడింది. 1997 నుంచి ఆయన దాదాపు 2 మిలియన్‌ పౌండ్లు విలువైన లిథోగ్రఫీ చిత్రాలను విక్రయించారు. రాయి లేదా మెటల్‌ బేస్‌ మీద వాటర్‌ కలర్స్‌తో ఆయన ఈ చిత్రాలు గీస్తారు. ఆయన కుటుంబం నివసించే హైగ్రోవ్‌ హౌస్‌ సమీపంలోని సొంత దుకాణంలో వీటిని విక్రయించారు. వీటి ద్వారా వచ్చిన సొమ్ము ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌కు వెళుతుంది. ఈ సంస్థ పలు సామాజిక కార్యక్రమాలకు నిధులను వెచ్చిస్తుంది.

బ్రిటన్‌లో ఉత్తమ చిత్రకారులు ఏటా దాదాపు పది వేల పౌండ్ల వరకు సంపాదిస్తుండగా యువరాజు చార్లెస్‌ సగటున రెండు లక్షల పౌండ్ల వరకు సంపాదిస్తున్నారు. చార్లెస్‌ ఈ చిత్రాలను క్వీన్స్‌ ఎస్టేట్‌లోని బాల్మోరల్‌ అండ్‌ శాండ్రింగామ్‌ హౌస్‌ల వద్ద, పర్యటనలకు వెళ్లినప్పుడు తయారు చేస్తుంటారని ఆయన ప్రతినిధి తెలిపారు.

English summary

According to a survey conducted by Clarence House and released to The Telegraph shows that the Britain Prince Charles has earned £2 million ($4.4 million) since 1997 from sales of copies of his watercolour paintings