సైకిలెక్కిన జడ్జీలు - అనుసరించిన సిబ్బంది 

Great Judges On Cycle,Staff Follows

04:50 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Great Judges On Cycle,Staff Follows

ఇద్దరు జడ్జీలు సైకిల్ ఎక్కారు. అంటే టిడిపి లోకి వచ్చినట్టు కాదండోయ్. పర్యావరణ పరిరక్షణ , కాలుష్య నివారణకు ఆ జడ్జీలు తీసుకున్న నిర్ణయం ఇది. కనీసం నెలకోసారి సైకిలు మీదే డ్యూటి కి రావాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది కూడా అదే బాట అనుసరించారు. వివరాల్లోకి వెళితే , రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జిలు.. సిబ్బంది అంతా శనివారం సైకిళ్ల మీద కోర్టుకు వచ్చారు. ఇలా రావటం ఆసక్తికరంగా మారింది. పర్యావరణ పరిరక్షణకు.. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎవరికి వారు.. ఎంతోకొంత మేర ప్రయత్నం చేయాలన్న లక్ష్యంతొ తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ప్రతి నెల ఒక రోజు కోర్టు సిబ్బంది అంతా సైకిళ్ల మీద రావాలని నిర్ణయించారు. మార్పు ఎక్కడో ఒక చోట మొదలు కావాలని చెబుతారు. అలాంటి మార్పునే.. రంగారెడ్డి జిల్లాకోర్టు న్యాయమూర్తులు.. సిబ్బంది స్టార్ట్ చేయడం నిజంగా అభినందనీయం. మార్పుకోసం చేసిన ఈ ప్రయత్నం స్ఫూర్తి నిస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సైకిలు గుర్తు మీద గెలిచిన తెలుగు తమ్ముళ్ళు కూడా ఇదే బాట పడితే, వారెవ్వా మార్పు తధ్యమే కదా ....

English summary

Judges all over Rangareddy district,Telangana were came to Courts on cycle to protect environment.Not only judges all the staff were followed judges and they too came on Cycle