30 వరకు యాగశాల ఉంచాలని నిర్ణయం

Great Response To Ayutha Chandi Yagam

02:10 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Great Response To Ayutha Chandi Yagam

వ్యక్తిగత హోదాలో తెలంగాణా సిఎమ్ కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లి లో నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి జనం పోటెత్తుతున్నారు. ఓపక్క సామాన్యులు.. మరోపక్క వీవీఐపీలు ప్రవాహంలా వస్తున్నారు. దీంతో యాగం 27వ తేదీ తో ముగియనున్నప్పటికీ 30వ తేదీ వరకు యాగశాల ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. 30వరకు భక్తులు యాగ శాలను సందర్శించ వచ్చని నిర్వాహకులు ప్రకటించారు.

4వ రోజు హాజరైన రోశయ్య - పవర్...

యాగం నాల్గవరోజు శనివారం అయుత చండీ యాగానికి తమిళనాడు గవర్నర్ కె రోశయ్య , నేషనల్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. కెసిఆర్ వారికి ఎదురెళ్ళి సాదర స్వాగతం పలికారు. ఋత్వికులు ఈ సందర్భంగా ఋత్వికులు పూర్ణకుంభం తో రోశయ్యకు స్వాగతం పలికారు. ఎంపిలు సుబ్బిరామిరెడ్డి ,కె కేశవరావు తదితరులు కూడా వచ్చారు. ఇంకా పలువురు అధికారులు , ప్రముఖులు వచ్చారు.

రోజు రోజుకూ పెరుగుతున్న జనం...

ఆయుత చందీయాగానికి రోజు రోజుకు భక్తులు హెచ్చుతున్నారు. యాగం తొలి రోజున 50వేల మంది వస్తే.. రెండో రోజు లక్షకు పైగా వచ్చారు. మూడో రోజు అనుకున్న దానికి మించి భారీగా భక్తజనం తరలి రావటంతో 2.5 లక్షలకు చేరిందని అంటున్నారు. దీంతో.. యాగస్థలి మొత్తం జనసంద్రంగా మారిపోయోంది. దీనికి తోడు.. వీఐపీలు కూడా భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా తొలి రెండురోజుల్లో వచ్చిన వీఐపీలకు చెందిన కుటుంబ సభ్యులు పలువురు మూడో రోజు కూడా తరలివచ్చారు. చినజీయర్ స్వామి.. మాధవానంద స్వామి.. పరిపూర్ణానంద స్వామి ఒకేరోజు రావడం కూడా శుక్రవారం నాటి విశేషాల్లో ఒకటి. శుక్రవారం ఒక్కరోజులో కుంకుమార్చన చేసిన మహిళలు దాదాపు 25వేల మంది వరకు ఉండొచ్చని అంచనా. ఇంత భారీగా మహిళలు కుంకుమార్చన చేసినప్పటికీ.. వారందరికి ప్రసాదాలు అందజేయబడ్డాయి.

ఒక్కరోజులో రెండు లక్షల మంది యాగానికి పోటెత్తటంతో మొదటి రోజు అన్నీ అందరికి అందిన చాలా సౌకర్యాలు మూడో రోజు అందని పరిస్థితి ఏర్పడినా , ముఖ్యమంత్రే స్వయంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించటం వల్ల ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఆయన చేతుల్లో ఉండటంతో ఇంతమందిని కంట్రోల్ చేయటం సాధ్యమైందన్న మాట వినిపించింది. .. వేరే వారి వల్ల అయితే.. సాధ్యమయ్యేది కాదని పలువురు చెప్పుకోవడం విశేషం.

ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న ప్రముఖులు ......

ఇక ట్రాఫిక్ జాంలో ఇరుక్కపోయిన ప్రముఖుల్లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ తో పాటు పలువురు ప్రముఖులున్నారు. వీరేకాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ట్రాఫిక్ జాం బాధితులే కావటం విశేషం.

శుక్రవారం.. అందులోకి సెలవు దినం కావటంతో భక్త జనం భారీగా వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరపడిన పలు జిల్లాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ జనం పెద్దయెత్తున యాగం దగ్గర కు రావడం విశేషంగా చెప్పుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు యాగానికి తరలిరావటంతో భారీగా ట్రాఫిక్ జాం చోటు చేసుకుని, దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ఫలితంగా వాహన రాకపోకల మీద ఆంక్షలు విధించటంతో పెద్ద ఎత్తున భక్తులు తమ వాహనాల్ని పార్కింగ్ చేసిన ప్రదేశం నుంచి నాలుగైదు కిలోమీటర్ల వరకూ నడవాల్సి వచ్చింది. భక్తులు వచ్చిన వాహనాలే దాదాపుగా 30వేల మంది వరకు ఉంటాయని అంచనా వేసారు.వచ్చే వారి సంఖ్య భారీగా పెరగటంతో అందరికి భోజనాలు.. మంచినీళ్లు ఏర్పాటు చేయటంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరుగుదొడ్లు.. మూత్రశాలల వద్ద కూడా సమస్యలు కూడా ఎదురయ్యాయి. అయితే తప్పిపోవటాలు.. ప్రమాదాలు.. తొక్కిసలాటలు లాంటి ఘటనలు లేకపోవడం ఊరట నిచ్చింది.

మూడవరోజు ఏర్పడిన ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాల్గవ రోజు అదనపు ఏర్పాట్లు చేసారు. అలాగే భక్తుల సంఖ్య నియంత్రించడానికి డిసెంబర్ 30వ తేదీ వరకు యాగశాలను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.

English summary

As we know Telengana CM K Chandrashekar Rao organizing Ayutha Chandi Yagam. It got great response from the both telugu states.