ఎంఐ ప్యాడ్‌ 2 రికార్డు అమ్మకాలు

Great Response To Xiaomi Mi Pad 2

06:24 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Great Response To Xiaomi Mi Pad 2

ప్రముఖ చైనా మొబైల్‌ సంస్థ జియోమి తక్కువ ధరతో అత్యధిక ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారుచేస్తూ ప్రపంచ మొబైల్‌ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది . జియోమి కంపెనీ తాజాగా 'ఎంఐ ప్యాడ్‌ 2' పేరిట ఒక టాబ్లెట్‌ పీసిను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఈ ఎంఐ ప్యాడ్‌ 2 టాబ్లెట్‌ ను ఆన్‌లైన్‌ ఫ్లాష్‌ సేల్ లో పెట్టగా కేవలం కొద్ది నిమిషాలలోనే అమ్ముడయ్యాయి. 7.9 ఇంచులు స్క్రీన్‌ కలిగిన ఈ టాబ్లెట్ లో 16/64 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 2 జిబీ ర్యామ్‌, 6190 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 2.24 గిగా హెర్జ్‌ ప్రాసెసర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి . ఈ టాబ్లెట్‌ కేవలం అండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం మీదనే కాక విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంలో కూడా లభిస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టం కు ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ఈ టాబ్లెట్ ను విండోస్10 ఆపరేటింగ్ సిస్టంతో కుడా విడుదల చెయ్యడం విశేషం.

English summary

Xiaomi recently launched Mi pad 2 in India.This 7.9 inch tablet was completely sold out under a minute of the sale going live. This tablet comes with a features like 2GB ram,6190 mah battery,16/64 gb internal memory.This is the first tablet which comes in both android and windows operating system versions