గ్రీస్ ప్రజలు గుమ్మానికి ఉల్లిపాయలు కడతారట ... ఎందుకో తెలుసా

Greece people tie onions at the front door...Do you know why

11:02 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

Greece people tie onions at the front door...Do you know why

తెలుగువారికి ఉగాది రోజు అంటే కొత్త సంవత్సర ఆరంభ వేడుక. ఈ సందర్బంగా మనకు కొన్ని సంప్రదాయాలున్నాయి. అలాగే నూతన ఆంగ్ల సంవత్సరాది అయిన జనవరి ఒకటిన ప్రత్యేక పద్ధతుల్ని పాటించే దేశాలూ చాలావున్నాయి. కొత్త ఏడాది రాగానే పన్నెండు ద్రాక్షల్ని నోట్లో వేసుకుంటారు. గుమ్మాలకు ఉల్లిపాయల్ని కడతారు. పాత సామగ్రిని బయటికి విసురుతారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నూతన సంవత్సర సంప్రదాయాలు చాలానే ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల భలే వింత సంప్రదాయాలు కూడా వున్నాయట. అవేమిటో ఓసారి చూద్దాం

1. నూతన సంవత్సరం కొత్త ఆశల్ని చిగురింపచేయాలని కోరుకుంటూ గ్రీస్ ప్రజలు డిసెంబరు 31 రాత్రి గుమ్మానికి ఉల్లిపాయలు కడతారు. మరుసటిరోజు వాటితో పిల్లల తలమీద తట్టి వారిని నిద్రలేపుతారు.

2. స్పెయిన్ లో కొత్త ఏడాది రాగానే పన్నెండు ద్రాక్షల్ని తింటారు. అలా చేస్తే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందనేది ఓ నమ్మకం.

3. కొత్త ఏడాదిలో ఎక్కువమంది స్నేహితులు దొరకాలని కోరుకుంటూ డెన్మార్క్ లోని ప్రజలు ఇంట్లో పగిలిపోయిన వస్తువుల్ని తీసుకెళ్లి ఇరుగు పొరుగు ఇళ్లముందు పడేస్తారు.

4. నూతన సంవత్సరం ప్రారంభంకాగానే జపాన్ లోని బౌద్ధారామాల్లో 108సార్లు గంటలు కొడతారు. మనిషికి ఉండే 108 రకాల బలహీనతలను పారదోలడానికి ఇలా చేస్తారట. కచ్చితంగా జనవరి 1న చేరేలా సన్నిహితులకు శుభాకాంక్షల కార్డులు పంపడం కూడా జపనీయుల సంప్రదాయంలో భాగమే.

5. జర్మనీవాసులు పంది ఆకారంలో చేసిన స్వీట్ తినడంతో పాటు, జనవరి 1న దేశం మొత్తం 1920ల నాటి ‘డిన్నర్ ఫర్ వన్ అనే హాస్య లఘుచిత్రాన్ని చూస్తారు. దీన్ని స్థానిక ఛానెళ్లన్నీ ప్రసారం చేస్తాయి.

6. బ్రెజిల్ వాసులు కొత్త ఏడాది రాగానే సముద్ర దేవతను పూజించి ఒక నావలో బహుమతులూ అత్తరూ ఆభరణాలూ పెట్టి నడి సంద్రంలోకి వదిలేసి, మనసులోని కోరికను తీర్చమని కోరుకుంటారు.

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

ఇది కూడా చూడండి: కొత్త సంవత్సరంలో 4 గ్రహణాలు

ఇది కూడా చూడండి: రెండు రకాల కొత్త వెయ్యి నోట్లు!

English summary

Generally Telugu people celebrate Ugadi as new year. On January 1st Different people follow different traditions to welcome luck into their lifes.