లాంగ్ జంపర్ 'వీర్యం' దాచుకున్నాడా! షాకింగ్ న్యూస్

Greg Rutherford freezes his sperm

01:35 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Greg Rutherford freezes his sperm

జికా వైరస్ భయం అందరినీ వెంటాడుతోంది. చివరకు ఈ వైరస్ కి జడిసి వీర్యం కూడా దాచుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంతకీ విషయం ఏమంటే, ప్రమాదకర జికా వైరస్ విషయంలో అథ్లెట్లలో భయం మాత్రం పోవడం లేదట. ఓ పక్క ఒలింపిక్స్ నిర్వాహకులు ఎంత భరోసా ఇస్తున్నా, ఈ వైరస్ భయంతో కొందరు పోటీలకే దూరమవుతుంటే.. ఓ బ్రిటన్ క్రీడాకారుడు ఎందుకైనా మంచిదని తన వీర్యాన్ని ముందే దాచేసుకున్నాడు. జికా గురించి భయపడ్డానికి, వీర్యాన్ని భద్రపరచడానికి సంబంధమేంటన్న సందేహం రావచ్చు. అయితే వివరాల్లోకి వెళ్ళాల్సిందే.

ఎవరికైనా జికా వైరస్ సోకితే అది వారి సంతానం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. పుర్రె చిన్నదిగా ఉండటం, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ సంగతి తెలిసే బ్రిటన్ లాంగ్ జంపర్ రూథర్ ఫర్డ్, ఎందుకైనా మంచిదని తన వీర్యాన్ని దాచుకున్నాడు. రూథర్డ్ ఫర్డ్ కు ఇప్పటికే ఓ కొడుకున్నాడు. ఐతే భవిష్యత్తులో ఇంకా పిల్లల్ని కనాలని రూథర్ ఫర్డ్, అతడి భార్య సుసీ వెరిల్ కోరుకుంటున్నారు. ఒకవేళ తనకు జికో వైరస్ సోకితే పిల్లల్ని కనడానికి ఇబ్బందువుతుందని ఆరోగ్యకరమైన తన వీర్యాన్ని తీసి భద్రపరిచే ఏర్పాటు చేశాడతను. 2012లో సొంతగడ్డపై జరిగిన ఒలింపిక్స్ లో రూథర్ ఫర్డ్ స్వర్ణం గెలిచాడు. ఆ పోటీలకు అతడి భార్య కూడా హాజరైంది. కానీ రియోకు మాత్రం తన భర్త వెంట వెళ్లడానికి ఆమె ఇష్టపడట్లేదు. దీనికీ జికా భయమే కారణం. మేం అనవసరంగా దేనికీ భయపడే రకం కాదు. ఐతే జికా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఒలింపిక్స్ ను రియో నుంచి తరలించాలని 10 మంది వైద్య నిపుణులు నొక్కి చెప్పాక భయం కలిగింది. అందుకే వీర్యం భద్రపరచాలని నిర్ణయించుకున్నాం అని సుసీ తెలిపింది. మొత్తానికి వీర్యం భద్రపరుచుకునే స్థాయికి రోగాలు, వైరస్ లు చేరిపోయాయి.

ఇవి కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు మగాళ్ళూ పెట్టచ్చు..

ఇవి కూడా చదవండి: స్నేక్ వైన్ గురించి ఎప్పుడైనా విన్నారా(వీడియో)

English summary

Britain Athlete Greg Rutherford freezes his sperm because of the Zike Virus over Rio Olympics. Brazil Government was giving assurance but so many players were not participating in Rio Olympics.