భక్తులే స్వయంగా అభిషేకించే జ్యోతిర్లింగం ఎక్కడుందో తెలుసా

Grishneshwar Jyotirlinga Temple In Aurangabad

12:48 PM ON 21st December, 2016 By Mirchi Vilas

Grishneshwar Jyotirlinga Temple In Aurangabad

అందమైన సుందరమైన శిల్పకళా సంపద గురించి చెప్పగానే మనకు ఎల్లోరా గుహలు గుర్తొస్తాయి. అయితే ఈ గుహలకు సమీపంలో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవదిగా వినుతికెక్కింది. అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ఔరంగబాద్ జిల్లా, వేరూల్ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు. అందుకే దీన్ని దర్శించడం మహాద్భాగ్యంగా భావిస్తుంటారు.

"ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే' అంటూ కొలిచే ఈ క్షేత్రం గురించి తెలుస్తుకోవాలంటే, వివరాల్లోకి వెళ్ళాలి.

1/15 Pages

పురాణగాథ

పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారట. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్ ’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్ గా మారింది. ఈ ప్రాంతం 'ఏలగంగా' నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్ గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం కూడా వుంది.

English summary

Grishneshwar Jyotirlinga Temple In Aurangabad. Grishneshwar Jyotirlinga Temple also known as Dhushmeshwar temple is one of the 12 Jyotirlinga shrines mentioned in the Shiva Purana.