పెళ్ళైన మూడు గంటల్లోనే జరగరానిది జరిగిపోయింది!

Groom died in 3 hours after marriage

04:24 PM ON 27th April, 2016 By Mirchi Vilas

Groom died in 3 hours after marriage

పెళ్లై మూడు గంటలే అయ్యింది. కానీ ఈ లోపే జరగరానిది జరిగిపోయింది. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అసలు విషయంలోకి వెళ్తే కర్నాటక బళ్లారి జిల్లాలోని కొట్టూరు గ్రామానికి చెందిన ఓ ఇంట్లో పెళ్లి వేడుక వైభవంగా జరుగుతోంది. పచ్చని తోరణాలు నడుమ.. బంధువులు, స్నేహితులతో ఇల్లంతా కళకళలాడిపోతోంది. బాజాభజంత్రీల మధ్య పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టాడు. అంతే.. జరగరాని దారుణం జరిగిపోయింది. కొట్టూరుకు చెందిన కొట్రేష్ కు తన అక్క కూతురితో వివాహం జరిగింది. వివాహం జరిగాక అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది.

అంతలోనే కొట్రేష్ కు గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపే పెళ్లి మంటపంలో కన్ను మూశాడు. దీంతో పెళ్లి మండపం అంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.

English summary

Groom died in 3 hours after marriage. In Karnataka, Bellary a groom died in 3 hours after completion of marriage due to heart attack.