కొడుకు పెళ్ళి తండ్రి ప్రాణాలు తీసింది(వీడియో)

Grooms father died in celebratory gun firing in Madhya Pradesh

03:46 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Grooms father died in celebratory gun firing in Madhya Pradesh

అవును మీరు వింటుంది నిజమే కొడుకు పెళ్ళి తండ్రి ప్రాణాలు తీసింది. పెళ్ళికి వచ్చిన వాళ్లందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇంక పెళ్ళికొడుకు తరపున వాళ్లు మిన్నంటేలా సంబరాలు జరుపుతున్నారు. కొడుకు పెళ్ళి కావడంతో తండ్రి మురిసిపోతున్నాడు. అందరూ ఆనంద తాండవం చేస్తుండగా ఇంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. మధ్యప్రదేశ్‌ లో ఉన్న ఉజ్జయినీ ప్రాంతంలోని బాద్‌నగర్‌ లో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. పెళ్ళి కావడంతో అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సంబరాల్లో భాగంగా పెళ్ళి కొడుకు తరపున వారు తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారు.

అయితే అందులో ఒకరు తుపాకీని కాస్త కిందకి పెట్టి కాల్చడంతో అటు వైపు నుండి వస్తున్న పెళ్లికొడుకు తండ్రి తలకు బులెట్ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీనితో ఆ పెళ్ళింట ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. తండ్రి చనిపోవడంతో పెళ్లికొడుకు కన్నీరుమున్నీరుగా విలపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

English summary

Grooms father died in celebratory gun firing in Madhya Pradesh. In Marriage celebrations Groom's father killed in celebratory firing.