గ్రూప్ -2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

Group 2 Jobs Notification In Telangana

11:33 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Group 2 Jobs Notification In Telangana

ఎప్పటినుంచో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 1032 గ్రూప్ -2 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన 439 ఖాళీలతో పాటు ఇటీవల అనుమతించిన 593 పోస్టులకు కలిపి మొత్తం 1032 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

శుక్రవారం( సెప్టెంబర్ 2) నుంచి 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. నవంబర్ 12, 13 తేదీల్లో గ్రూప్ -2 పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పోస్టల వివరాలు ఇలా వున్నాయి.

* మున్సిపల్ కమిషనర్లు- 19

* ఏసీటీవోలు-156

* సబ్ రిజిస్ట్రార్లు-23

* పంచాయతీరాజ్ విస్తరణ అధికారులు-67

* ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్లు-284

* డిప్యూటీ తహసీల్దార్లు-259

* సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు-62

* దేవాదాయశాఖ ఈవోలు-11

* అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు- 3

* చేనేత ఏడీవోలు 20

* సచివాలయ ఏఎస్ వోలు-90

* ఆర్థిక శాఖ ఏఎస్ వోలు- 28

* న్యాయశాఖ ఏఎస్ వోలు- 10

ఇవి కూడా చదవండి:చనిపోయిన ఆ కుర్రాడు సెల్ నుంచి మెసేజ్ ... పోలీసులకు దిమ్మ తిరిగింద

ఇవి కూడా చదవండి:అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలికకు ఉల్లిపాయలు అమ్మి తమవంతు సాయం చేసిన పవర్‌స్టార్‌ ఫ్యాన్స్

English summary

Telangana Government has released the notification for Group-2 cador jobs in Telangana State. Total 1032 jobs notification was released by the Telangana Government.