ఆ లేడీ కిలాడీలు అడ్డంగా బుక్కయ్యారు (వీడియో)

Group Of Ladies Caught On Camera Stealing Sarees

11:32 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Group Of Ladies Caught On Camera Stealing Sarees

వామ్మో, దొంగతనం వీరలెవెల్లో చేసెయ్యడం ఆడ దొంగలకు బాగా పెరిగిపోయింది. గతంలో లేడీ కిలాడీలు పలు షోరూంల్లో హల్ చల్ చేశారని విన్నాం. అయితే తాజాగా నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి టౌన్ లో లేడీ కిలాడీలు హల్ చల్ చేశారు. గురువారం సాయంత్రం ఐదుగురు మహిళల టిప్ టాప్ గా తయారై స్థానిక నటరాజ క్లాత్ షోరూమ్ కు వచ్చారు మామూలుగా చీరలు వద్ద.. హైరేంజ్ లో కాస్ట్లీ చీరలు కావాలని హడావుడి చేశారు. ఐతే, వారి వ్యవహారంపై ఎక్కడో అనుమానం వచ్చిన యజమాని కాస్త సీసీ కెమెరాపై కన్నేశాడు. కాస్ల్టీ చీరలు కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేశారని అర్థమైంది. ముందు ఒక మహిళ కింద కూర్చొని చీరలు చూస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. ఆ మహిళను కవర్ చేసేందుకు ఇంకో మహిళ చీరతో అడ్డంగా నిలబడింది. మరో మహిళ, కిందన కూర్చున్న ఆమె కనిపించకుండా నిలబడింది. మరో మహిళ, కింద కూర్చున్న ఆమె కనిపించకుండా నిలబడింది.

ఈ క్రమంలోనే కింద కూర్చున్న మహిళ ఖరీదైన ఐదు పట్టు చీరలను తన చీరలో దాచేసింది. పని ఐపోయిన వెంటనే బయటకు కామ్ గా వెళ్లిపోయేందుకు అందరూ తలుపు దగ్గరకు వెళ్లారు. మొత్తం దొంగతనాన్ని సీసీ కెమెరాల్లో చూస్తున్న యజమాని అలర్టయి డోర్లు మూసేశాడు. దీంతో భయపడిన ఓ మహిళా దొంగ తాను దాచిన చీరలను కిందపడేసి కాళ్లతో తన్నేసింది. మిగతా వారు కూడా ఏమీ ఎరుగనట్టు నటించారు. ఐతే, సీసీకెమెరాలో వీరి నిర్వాకమంతా రికార్డు కావడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్లని అప్పగించారు.

English summary

Group Of Ladies Caught On Camera Stealing Sarees in Nalgonda district.