జీఎస్ఎల్వీఎఫ్-05 రాకెట్ దూసుకెళ్లింది(వీడియో)

GSLV- F05 carrying advanced weather satellite

07:01 PM ON 8th September, 2016 By Mirchi Vilas

GSLV- F05 carrying advanced weather satellite

భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు మరో మైలురాయి అధిగమించారు. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ తో నాల్గవ సారి జీఎస్ఎల్వీ-ఎఫ్ 05 రాకెట్ ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ ఎఫ్- 05ని గురువారం సాయంత్రం ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా దేశ వాతావరణ సమగ్ర సమాచారాన్ని తెలిపే 2211 కిలోల ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఇన్శాట్ 3 డీఆర్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎస్05 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఈ ఉపగ్రహం మనదేశ భూభాగంపై వాతావరణాన్ని గంటకోమారు మనదేశ సముద్రాలపై సమాచారాన్ని 6 గంటలకోసారి అందజేస్తారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన సౌండర్ పరికరం వాతావరణ పరిస్థితులను ముందుగానే పసికట్టి సమాచారాన్ని అందజేస్తుంది. దాంతో వాతావరణ విపత్తులను ముందుగా అంచనావేసే అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పేమాట. అలాగే ఉపగ్రహాంలో అమర్చిన ఇమేజర్ పరికరం భూ, సముద్ర ఉపరితల పరిశీలన, ఉష్ణోగ్రతలను తెలిపేలా రూపొందించారు. ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ఇది కూడా చదవండి: డబ్బు కోసమే రాధికా ఆప్టే న్యూడ్ వీడియో లీక్ చేసారా?

ఇది కూడా చదవండి: ఆ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బ్రతుకుతారు.. ఆ రహస్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు!

ఇది కూడా చదవండి: చీక్స్ ఫ్యాట్ కరిగించుకోవడానికి అద్భుతమైన టిప్స్

English summary

GSLV- F05 carrying advanced weather satellite