గెస్ట్‌ను చంపేసారు

Guest Killed In a Wedding

11:01 AM ON 10th December, 2015 By Mirchi Vilas

Guest Killed In a Wedding

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని సహరన్‌పూర్‌ కు చెందిన ఒక వ్యక్తిని ఒక పెళ్ళిలో తాము పెట్టమన్న పాటను పెట్టలేదని ఆగ్రహించి చంపేసారు.

గత సోమవారం రాత్రి, మనోజ్‌ ఒక పెళ్ళి వేడుకకు వెళ్ళాడు. మనోజ్‌ తాను చెప్పిన పాటను పెట్టాల్సిందిగా డీజేను కోరాడు. పెళ్ళికి వచ్చిన మరో అతిధి సచిన్‌ అనే వ్యక్తి ఇప్పుడు ప్లే అవుతున్న పాటనే కొనసాగించమని చెప్పగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మనోజ్‌ తన ముగ్గురు మిత్రులను తీసుకువచ్చి సచిన్‌ ను కొట్టడం మొదలు పెట్టారు. సచిన్‌ ను తీవ్రంగా కొట్టడంతో సచిన్‌ అక్కడికక్కడే మృత్తి చెందాడు.

స్థానిక ఎస్‌పి జగదీష్‌ శర్మ మాట్లాడుతూ వారిని అరెస్టు చేసామని వారందరి పై హత్యా నేరం వంటి పలు కేసులను వారి పై నమోదు చేసామని తెలిపారు.

English summary

A man was killed in a marriage for not playing the song of his choice uttar pradesh