మళ్ళీకాల్పుల మోతతో వణికిన అమెరికా 

Gun fire again in America

04:48 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Gun fire again in America

ఐదు రోజుల క్రితం న్యూ ఆరియాన్స్‌ లోని ఒక పార్కులో రెండు వేరువేరు గ్యాంగ్‌ల మధ్య చోటు చేసుకున్న ఘటనలో 10 మంది మరణించిన సంఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని కొలరాడో స్ప్రింగ్స్‌ పట్టణంలోని ఒక ఆసుపత్రి లోపలికి ప్రవేశించిన ఆయుధాలు కలిగిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ సమాచారం అందుకున్న కొలరాడో పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. దుండగుడికి, పోలీసుల మధ్య జరిగిన భీకర పోరు జరిగింది. ఈ కాల్పులో ఒక పోలీసు అధికారి సహా మరో ఇద్దరు పౌరులు మృతి చెందారు. క్షతగాత్రులను వైద్యం నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. ఐదు గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌ తరువాత దుండగుడిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ఒబామ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.

English summary

Once again gun fire occur in america.An unknown person enters into a hospital in colorado springs in colorado state in america. Three people died in this incident