న్యాయమూర్తి ఎదుటే కోర్టులో కాల్పులు 

Gun Fire In Delhi Court

02:01 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Gun Fire In Delhi Court

అబ్బబ్బ, ఎంత బరితెగించిపోయారు.... కోర్టు రూమ్‌లోనే జడ్జి ఎదుట దుండగుల కాల్పులా? పైగా ఈ దారుణం జరిగింది ఎక్కడో కాదు , దేశ రాజధాని ఢిల్లీలోనే. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలోకి వెళితే, బుధవారం ఉదయం జైలు నుంచి చెన్నూ పెహల్వాన్ అనే క్రిమినల్‌ని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, అక్కడే మాటు వేసిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారట. కోర్టు రూమ్‌లోనే జడ్జి ఎదుట దుండగులు10 రౌండ్ల కాల్పులు జరిపారు. రెండు వర్గాల మధ్య ఘర్సహ్నే ఇందుకు దారితీసిందని అంటున్నారు.

పట్టపగలు కర్కర్ డూమా కోర్టులో జరిగిన ఈ ఘటనతో అటు జడ్జీలు, న్యాయవాదులు సైతం షాక్ తిన్నారు. ఈ ఘటనలో రామ్‌కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ మరణించగా, మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఇద్దరు నిందితులు పారిపోగా, మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న ట్లు చెబుతున్నారు.

English summary

A gun fire occured in a Court in Delhi. In this incident two police conistables got injured and one conistable died