గే నైట్ క్లబ్ లో మారణ హోమం

Gun Fire Kills 50 People In America gay Club

11:34 AM ON 13th June, 2016 By Mirchi Vilas

Gun Fire Kills 50 People In America gay Club

అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి కదం తొక్కింది. నిండు ప్రాణాలు తీసేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో ఉన్న పల్స్ అనే స్వలింగ సంపర్కుల నైట్ క్లబ్ లో మారణ హోమం చోటుచేసుకుంది. ఓమర్ మటీన్ అనే సాయుధ దుండగుడు జరిపిన కాల్పుల్లో 50 మందికిపైగా దుర్మరణంపాలయ్యారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. అయితే అతికష్టం మీద ఓమర్ మటీన్ ను పోలీసులు కాల్చి చంపేశారు. ప్రాథమిక విచారణలో అతడు ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూయీస్ వాసిగా పోలీసులు గుర్తించారు. అతడికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం.

9/11 తర్వాత.. అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా సీఎన్ ఎన్ వార్తాసంస్థ దీన్ని అభివర్ణించింది. కాగా, మటీన్ సూసైడ్ వెస్ట్ లాంటి దాన్ని ధరించి, అసాల్ట్ రైఫిల్, హ్యాండ్ గన్, ఇతర ఆయుధాలతో క్లబ్ లోకి లోపలికి వచ్చి.. కాల్పులు జరిపాడని.. మిగిలినవారిని బందీలుగా పట్టుకున్నాడాని క్లబ్ లో అతడిబారి నుంచి తప్పించుకున్నవారు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక.. 2 గంటల సమయంలో జరిగిందిది. నిజానికి మటీన్ లోపలికి వెళ్లే ముందు అతడికి, అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుకు మధ్య కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న స్వాట్ టీమ్ తెల్లవారుజామున 5 గంటల సమయంలో క్లబ్ తలుపులు పగలగొట్టి లోపలికి దూసుకెళ్లి అతడిని మట్టుబెట్టింది.

ఈ క్రమంలో పోలీసుల్లో ఒకరి తలకు మటీన్ కాల్చిన తుపాకీ తూటా తగిలిందిగానీ, అదృష్టవశాత్తూ ఆ పోలీస్ తలకు హెల్మెట్ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. దీన్ని ఉగ్రవాద చర్యగానే పరిగణించి దర్యాప్తు జరుపుతున్నామని ఎఫ్బీఐ అధికార ప్రతినిధి తెలిపారు. అతడు రాడికల్ ఇస్లామిస్ట్ భావజాలం వైపు ఆకర్షితుడైనట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. దుండగుడికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఏవైనా సంబంధాలున్నాయా లేక దేశీయ ఉగ్రవాదమా? లేక తనంత తానుగానే ఈ కాల్పులకు తెగబడ్డాడా (లోన్ వూల్ఫ్ దాడి) అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు.ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితి విధించారు. కాగా.. ఈ కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 320 మంది దాకా లోపల ఉన్నట్టు చెబుతున్నారు.

అయితే, క్లబ్ కు చెందిన ఒక బౌన్సర్ .. కాల్పులు మొదలవగానే వెనకదారి గుండా తప్పించుకునేందుకు వీలుగా లోపలున్న ఒక పార్టిషన్ ను పగలగొట్టాడని, దాని ద్వారా కొందరు తప్పించుకున్నారని తెలుస్తోంది. కాగా, అమెరికాలో నిత్యకృత్యంగా మారిన ఇలాంటి దుర్ఘటనలను మాస్ షూటింగ్ ట్రాకర్ ’ వెబ్ సైట్ ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంది. అందులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2015లో అమెరికాలో మాస్ షూటింగ్స్ లో చనిపోయినవారి సంఖ్య 475. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా మాస్ షూటింగ్స్ లో చనిపోయినవారు 156 మంది కావడం గమనార్హం. నైట్ క్లబ్ మారణహోమంపై అమెరికా ప్రెసిడెంట్ ఒబామా దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

ఇవి కూడా చదవండి:ప్రేయసి కేకలతో ప్రియుడి పై పోలీసులు బుల్లెట్ల వర్షం(వీడియో)

ఇవి కూడా చదవండి:డబ్బు కోసం కూతుళ్ళను బ్లూ ఫిల్మ్స్ తీసే నిర్మాతకు అమ్మేసిన తల్లిదండ్రులు

English summary

An Afganistan man named Oman Marteen was killed 50 people in a Gay Club in America. Later He was killed by the local police.