షిర్డీ సన్నిధిలో  ప్రమాదవశాత్తు పేలిన రైఫిల్‌

Gun Fired in Shiridi

03:50 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Gun Fired in Shiridi

షిరిడి సాయిబాబా సిద్ధి పొందిన షిర్డీ ఆలయంలో గురువారం ప్రమాదవశాత్తు ఓ రైఫిల్‌ పేలింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌ వద్ద ఉన్న రైఫిల్‌ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆలయంలోని రెండో నెంబర్‌ గేటు వద్ద విధి నిర్వహణ ముగించుకొన్న పోలీసు మరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైఫిల్ పేలడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. విషయం తెల్సి , ఊపిరి పీల్చుకున్నారు.

English summary

A Rifle fired in Sri Shiridi Sai baba Mandir in Shiridi.The police official near the second gate Rifle was fired acidentally.No one injured or died in This incident.