గన్ మెన్ కి తెలీకుండా ఖాతాలోకి 100కోట్లు

Gun Man Shocked By Seeing 100 crores in his Bank Account

11:25 AM ON 5th January, 2017 By Mirchi Vilas

Gun Man Shocked By Seeing 100 crores in his Bank Account

రూ 500, రూ 1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల ఖాతాలో హఠాత్తుగా కోట్ల రూపాయలు జమ అవుతూ రావడం తెల్సిందే. ఇంకా అనేక విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది ఖాతాల్లో వారికి తెలియకుండానే కోట్ల రూపాయలు చేరుతున్నాయి. అవి కొద్దిసేపట్లో మాయం కావడాన్ని చూస్తున్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో గన్ మెన్ గా పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ గులాం జిలానీ బ్యాంకు ఖాతాలో ఏకంగా వంద కోట్లు జమకావడం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకీ వద్ద ఆయన గన్ మెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గత రాత్రి ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బు డ్రా చేసిన అనంతరం ఏకంగా రూ.99,99,02,724 బ్యాలన్స్ గా ఉన్నట్టు ఫోన్ కు సందేశం వచ్చింది. దీంతో నిర్ఘాంతపోయిన జిలానీ వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యే దీన్ని కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో బ్యాంకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆ ఖాతాను స్తంభింపచేశారు. ఇంత మొత్తం అతని ఖాతాలోకి ఎలావచ్చింది అన్న అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని ఒక ప్రాంతంలో చిన్న అద్దె ఇంట్లో నివాసముండే జిలానీ ఖాతాలో కోట్లాది డబ్బులున్నట్టు వార్తలు రావడంతో అతని కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల సంభవించాయి.

ఇవి కూడా చదవండి: 2017 మొదటి చిన్నారిగా బ్రిటన్ లో ఎవరో తెలుసా?

ఇవి కూడా చదవండి: కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

English summary

So many people were suffering with the cancellation of currency notes and so many people were caught by IT department officials and now a gun man in Uttar pradesh was shocked by seeing 100 crores in his bank account and he immediately informed to near MLA and Collector of that area.